ఏంటి.. బ్రేకేలేదా మహేషా!!

Update: 2017-04-03 18:01 GMT
ఇప్పుడు మహేష్‌ బాబు స్పీడ్ మీదున్నాడు. నిజానికి బ్రహ్మోత్సవం సినిమా తేడాపడినప్పుడే.. ఈసారి దూకుడుగా తన కొత్త సినిమాను దించేస్తాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే మరుగుదాస్ డైరక్షన్లో చేస్తున్న సినిమాను అమాంతంగా మొదలెట్టేశాడు. ఆపకుండా అప్పటినుండి షూటింగ్ చేస్తూనే ఉన్నాడు.

విశేషం ఏంటంటే.. మొన్నటివరకు ఒక వారం రోజులపాటు మహేష్‌ బాబు వియత్నాంలోని ఒక థీమ్ పార్క్ లో కొన్ని పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నాడు. అక్కడే ఫైట్ మాష్టర్ పీటర్ హెయిన్స్ సారధ్యంలో.. మురుగ డైరక్షన్లో.. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ లతో కలసి మనోడు యాక్షన్ సీన్లను షూట్ చేశాడు. అయితే ఆ షూటింగ్ ముగించుకుని జస్ట్ నిన్ననే చెన్నయ్ లో కాలుమోపాడు. ఇలా అడుగుపెట్టాడో లేదో.. వెంటనే మద్రాసిపట్టణంలో కొత్త షెడ్యూల్ కూడా మొదలెట్టేశాడు. అసలు బ్రేకే లేకుండా మహేష్‌ ఎంత కష్టపడుతున్నాడో చూస్కోండి మరి.

ఇప్పటికే మహేష్‌ అండ్ మురుగుదాస్ సినిమా పేరు ''స్పైడర్'' అంటూ సంకేతాలు అందేశాయి. ఏప్రియల్ 14న తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఛాన్సుంది. ఒకేసారి తెలుగు తమిళ బాషల్లో రూపొందుతున్న ఈ బైలింగువల్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News