భావోద్వేగంతో మహేష్ ట్వీట్

Update: 2018-04-20 03:34 GMT
జీవితంలో ఇంపార్టెంట్ రోజున ఏదయినా మంచి సంఘటన జరిగితే అదో తియ్యని జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. హీరో మహేష్ బాబుకు ఈ ఏప్రిల్ 20వ తేదీ అలాంటి మంచి మెమొరీ మిగిలిపోనుంది. అది భరత్ అనే నేను సినిమా రిలీజ్ కావడం.. ఈ రోజు మహేష్ తల్లి ఇందిర జన్మదినం కావడం.

అమ్మ పుట్టిన రోజు.. ఎంతో ఉత్సాహంగా పనిచేసిన సినిమా రిలీజ్ రెండూ ఒకే రోజు కావడం కచ్చితంగా విశేషమే. అందుకే సాధారణంగా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే మహేష్ ఈ విషయాన్ని సంతోషంగా స్వయంగా షేర్ చేశాడు. తన తల్లి పాత ఫొటోను షేర్ చేస్తూ ప్రత్యేకంగా కామెంట్ పెట్టాడు.‘‘ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన సినిమాను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్ డే అమ్మా. భరత్ అనే నేను ఇన్ సినిమాస్ నౌ’’ అంటూ మహేష్ తన అనుభూతిని షేర్ చేసుకున్నాడు.

భరత్ అనే నేను సినిమాతో మహేష్ కెరీర్ లో తొలిసారి ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీ చేశాడు. ముఖ్యమంత్రిగా మహేష్ లుక్స్ ఇప్పటికే సినిమాపై మంచి క్రేజ్ ను పెంచాయి. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్నిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.
Tags:    

Similar News