ఓ సినిమాకి టైటిల్ ని ఫైనల్ చేసే ముందు.. అది ఆడియన్స్ లో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో తెలుసుకునేందుకు.. ఫీలర్లు వదులుతూ ఉంటారు. అలా ఒక్కో సినిమాకి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వస్తుంటాయి. తేడా వస్తే అబ్బే తాము అసలు ఇంకా దాని గురించి ఆలోచించనే లేదని తప్పించుకునే ఛాన్స్ ఉండనే ఉంటుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు-మురగదాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ సంగతి ఇలాగే ఉంది.
మొదట చట్టంతో పోరాటం.. ఆ తర్వాత ఎనిమీ.. ఆ మధ్య వాస్కో డ గామా.. ఇప్పుడు అభిమన్యుడు. ఇవీ మహేష్ సినిమాపై ప్రచారం జరిగిన టైటిల్స్. మొదటి మూడింటిని వద్దనుకోవడానికి రకరకాల రీజన్స్ ఉండగా.. ఇప్పుడు అభిమన్యుడు టైటిల్ కి.. అన్నిటికంటే ఎక్కువగా వ్యతిరేకత వస్తోంది. ఇందుకు కారణం.. ఇదే టైటిల్ తో గతంలో వచ్చిన రెండు తెలుగు సినిమాలు బోల్తా కొట్టేయడమే. 1984లో శోభన్ బాబు హీరో అభిమన్యుడు రాగా.. 2003లో అభిమన్యు అంటూ కళ్యాణ్ రామ్ ట్రై చేశాడు.
ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే ఫ్లాప్ టైటిల్ మనకెందుకు అనుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. దీని కంటే మొదట చెప్పుకున్న టైటిల్సే బాగున్నాయిగా అనేస్తున్నారు కూడా. మరి మహేష్ ఏమంటాడో.. మురుగ ఎటు మొగ్గుతాడో.