సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్.. అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్య సహాయం చేస్తున్నారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను చేయిస్తూ చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న 1010 మంది చిన్నారులకు ప్రాణదానం చేశారు మహేష్. ఈ క్రమంలో మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు మహేష్ బాబు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి మహేష్ చికిత్స ఇప్పించారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి, తన కుటుంబానికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ముందుకొచ్చి వారి పాలిట దేవుడిగా మారాడని.. మహేష్ నిజమైన హీరో అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుండి మొదలు కానుంది.