పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు ఎప్పుడు ఏ సినిమా కమిటవుతారో చెప్పలేం. వీళ్ల కోసం నిర్మాతలు ఎప్పుడూ క్యూలో ఉంటారు కాబట్టి.. సడెన్ గా కొత్త కాంబినేషన్లు లైన్ లోకొచ్చేస్తుంటాయి. ఈ రోజుల్లో కేవలం కాంబినేషన్ క్రేజ్ తోనే సినిమాల బిజినెస్ జరుగుతోంది కాబట్టి.. నిర్మాతలు అలా స్టార్ హీరోలు, డైరెక్టర్ల వెంట పడటంలో ఆశ్చర్యమేమీ లేదు. హీరోల్లో మహేష్ కు, డైరెక్టర్ల లో వి.వి.వినాయక్ కు ఉన్న క్రేజ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ ఎవరికి వాళ్లు రూ.50 కోట్ల మార్కెట్ ఉన్నవాళ్లే. మరి ఇద్దరూ కలిస్తే ఆటోమేటిగ్గా వంద కోట్ల టార్గెట్ ఫిక్స్ అయిపోతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం నిర్మాత డి.వి.వి.దానయ్య టార్గెట్ కూడా అదేనట.
ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ను తెరమీదికి తెచ్చేందుకు దానయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ కు త్రివిక్రమ్, రాజమౌళి, పూరి జగన్నాథ్ లతో కమిట్ మెంట్లు ఉన్నాయి. ఐతే ఏది ఎప్పుడన్నది ఫిక్స్ అవలేదు. వినాయక్ మాత్రం తర్వాతి సినిమా ఏదన్న విషయంలో క్లారిటీ తో లేడు. ఐతే సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది పక్కనబెడితే.. మహేష్, వినాయక్ కాంబినేషన్ లో సినిమాకు కమిట్ మెంట్ అయితే తీసేసుకున్నాడట దానయ్య. ప్రస్తుతం దానయ్య రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా తీస్తున్నాడు. దీని తర్వాత మహేష్, వినాయక్ ల సినిమానే నిర్మించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. దానయ్య పట్టుదల సరే కానీ.. ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే మాత్రం ప్రేక్షకులకు పండగే.