సూపర్ స్టార్ మహేష్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా పోకిరి రికార్డులకెక్కింది. అంతకుముందు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నిటినీ ఈ మూవీ బ్రేక్ చేయడం సంచలనమే అయ్యింది. ఇక అప్పట్లోనే మహేష్ లుక్ ని పూర్తిగా మార్చేసిన గురుడిగా పూరి పేరు మార్మోగింది.హెయిర్ స్టైల్ సహా బాడీ లాంగ్వేజ్ పరంగా మహేష్ ని అమాంతం మార్చేశాడు పూరి. అయితే ఇప్పుడు సర్కార్ వారి పాట కోసం గురువు పూరీనే ఫాలో చేస్తున్నాడు పరశురామ్. మహేష్ కి పోకిరి లుక్ ని ఆపాదించాడన్నది తాజాగా ఇన్ సైడ్ గుసగుస.
అందుకే మహేష్ లుక్ పూర్తిగా మారిపోయి కనిపిస్తోంది. ఇటీవల సోడాబుడ్డి కళ్లజోడు పెట్టుకుని మీసకట్టు తొలగించి పక్క పాపిడితో కాలేజీ బోయ్ లా కనిపిస్తున్నాడు మహేష్. ఈ లుక్ చూస్తుంటే మహేష్ ఏజ్ పాతికేళ్లు తగ్గిపోయిందన్న కామెంట్లు వినిపించాయి. జస్ట్ బడికెళ్లే కుర్రాడిలా ఉన్నాడంటూ అభిమానులు ఫీలయ్యారు.
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో సినిమా ఇది. వేలాది కోట్ల స్కామ్ స్టర్ వల్ల ఇబ్బందుల్లో పడే బ్యాంక్ మేనేజర్ కి కొడుకుగా మహేష్ కనిపిస్తాడట. ఆ కుంభకోణం నుంచి తండ్రిని ఎలా బయటపడేశాడు? అన్నదే సినిమా కథాంశం. తండ్రి కొడుకుల సెంటిమెంట్.. కీర్తి సురేష్ తో లవ్ స్టోరి.. గ్యాంగ్ స్టర్లతో యాక్షన్ ఇలా ఆద్యంతం రక్తి కట్టిస్తాయట. ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ముగించి హైదరాబాద్ లో దిగారు. తదుపరి ఓ కీలక షెడ్యూల్ ని తెరకెక్కిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్- జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.