శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ మూవీ. ఆ సినిమా టైంలో మహేష్ రేంజ్ ఓ స్థాయికి చేరిపోయింది. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ ఊరిని ఉద్ధరించే యువకుడి పాత్రలో సూపర్ స్టార్ నటనకు జనం జేజేలు పలికారు. ఆ సినిమా ప్రచార సమయంలోనే.. మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకోవడం.. ప్రభుత్వ పథకాలను తన చేతుల మీదుగా పంపిణీ చేయడం.. రాజకీయ ఊరేగింపుల వంటివి జరగడంతో.. మహేష్ కి- రాజకీయాలకు లింక్ పెడుతూ టాక్ వచ్చింది.
కానీ మహేష్ బాబు మాత్రం వాటన్నిటికీ తన సైలెన్స్ ద్వారానే సింపుల్ గా సమాధానం ఇచ్చేశాడు. అన్నీ సద్దుమణిగాయి అనుకుంటున్న టైంలో.. ఇప్పుడు మళ్లీ మహేష్ మాట రాజకీయాల్లో వినాల్సి వస్తోంది. అది కూడా సొంత బావ చేసిన కామెంట్స్ కారణంగానే కావడం విశేషం. మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ అనే సంగతి తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు మామ కృష్ణ.. బావ మహేష్ తో పాటు.. మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి చర్చించానన్న గల్లా జయదేవ్.. కృష్ణ సూచన మేరకే తాను గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసినట్లు మరోసారి చెప్పారు.
అయితే.. మహేష్ బాబుకు మాత్రం రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు గల్లా జయదేవ్. కానీ ఈయన మాటలన్నీ జాగ్రత్తగా తరచి చూస్తే మాత్రం.. మహేష్ బాబు రాజకీయాల్లో లేడు కానీ.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమకు అండగా నిలవాలని చెప్పేందుకే.. కృష్ణ పేరును పదే పదే ప్రస్తావించారనే టాక్ వినిపిస్తోంది.