మహేష్‌ సీఎం అయితే..!

Update: 2020-02-18 12:17 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కెరీర్‌ ఆరంభం నుండి రాజకీయాల్లోకి వచ్చినట్లే అనిపిస్తాడు కాని అంటి ముట్టనట్లే ఉంటాడు. తన వాళ్ల కోసం గతంలో ప్రచారం చేసినా కూడా మహేష్‌ బాబు ప్రత్యేకంగా ఒక పార్టీ అంటూ ఎప్పుడు కూడా సపోర్ట్‌ చేసింది లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూనే తనవంతు సేవను ప్రజలకు అందిస్తూ ఉంటాడు. పలు సేవా కార్యక్రమాలు చేసి గొప్ప మనసున్న హీరో అనిపించుకున్న మహేష్‌ బాబు రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కూడా కోరుకోవడం లేదు.

కాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాత్రం మహేష్‌ బాబుకు ఒక రాజకీయ నేపథ్యం ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు మహేష్‌ బాబు చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. ఇంతకు ఆ ప్రశ్న ఏంటీ అంటే మీరు కనుక ఒక్క రోజు సీఎం అయితే మొదటగా చేసే పని ఏంటీ.. ఎందుకు మీరు ఆ పని చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు మహేష్‌ బాబు స్పందిస్తూ నాకు ఏమీ తెలియదు. రాజకీయాల గురించి మాట్లాడే ఆసక్తి నాకు లేదు అన్నాడు.

రాష్ట్రాన్ని కాపాడేందుకు దేవుడు ఉన్నాడు కదా.. అన్ని ఆయన చూసుకుంటాడు అంటూ కాస్త వైరాగ్యంతో సమాధానం చెప్పాడు. మళ్లీ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా నో అన్నాడట. దాంతో టాపిక్‌ మార్చి సినిమాల గురించి ఆ ఇంటర్వ్యూవర్‌ ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News