మహేష్ రెడీ.. మరి డైరెక్టర్స్ ఎక్కడ ?

Update: 2015-08-07 12:58 GMT
మహేష్ ఇప్పుడు మాంచి సక్సెస్ మూడ్ లో ఉన్నాడు. తాను తొలిసారిగా నిర్మాణ బాధ్యతల్లో భాగం తీసుకుని, ప్రమోషన్-పబ్లిసిటీల్లో కూడా యాక్టివ్ పార్ట్ చేపట్టి... రిలీజ్ చేసిన మూవీ శ్రీమంతుడు. ఈ మూవీకి ఫ్యాన్స్, పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ పై మహా హుషారుగా ఉన్నాడు మురారి. ఈ హుషారులోనే డైరెక్టర్ల కు కొత్త క్లూ కూడా ఇచ్చాడు ప్రిన్స్..

శ్రీమంతుడిని మహేష్ పట్టుబట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పని లేదు అసలు. మహేష్ సినిమా వస్తోందంటే జనాలే క్యూ కడతారు. కానీ బాహుబలి కాకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సూపర్ స్టార్. అందుకే స్పెషల్ కేర్ తీసుకుని తెగ మాట్లాడేశాడు. మామూలుగా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసే మనోడు.. అఢిగినోళ్లందరికీ ఎడాపెడా ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చాడు.

మహేష్ ఇచ్చిన ఇంటర్యూ లలో ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ, స్పెషల్ పంచ్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇప్పటికే వెంకటేష్ తో మల్టీ స్టారర్ చేశారు కదా.. నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతోనూ నటిస్తారా అంటే... ఈ పోకిరి పంచ్ డైలాగ్ పేల్చాడు. మల్టీ స్టారర్స్ కి తానెప్పుడూ సిద్ధమేనని, ఇండస్ట్రీ కి ఇవి అవసరమని కూడా చెప్పాడు. మల్టీ స్టారర్ల పై మంచి కథలతో డైరెక్టర్లు ముందుకు రావాలని హింట్ కూడా వదిలాడు. మహేష్ ఓకే అన్నాడు. మిగతా వాళ్లు కూడా సై అనే పరిస్థితే. మరి డైరెక్టర్లు ఇప్పుడు స్క్రిప్టు లు సిద్ధం చేసుకోవడమే లేట్ అనిపిస్తోంది.
Tags:    

Similar News