మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ సమయానికే షెడ్యూల్ అయిన ఇతర చిత్రాలు.. టీజర్లు పాటలతో హంగామా చేస్తుండగా.. ఇప్పటివరకూ మహేష్ మూవీకి చిన్నపాటి టీజర్ కూడా ఇవ్వలేదు. ఒకట్రెండు పోస్టర్లు.. ఒకసారి వాయిస్ వినే భాగ్యం మాత్రమే ఫ్యాన్స్ కి దక్కింది.
అభిమానుల ఆతృతను హీరోతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా క్యాచ్ చేశాడు. అందుకే భరత్ అనే నేను మూవీకి పబ్లిసిటీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేయాలని డిసైడ్ అయ్యారు. మార్చ్ 6న విజన్ విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు. లక్షలాది జనసందోహాన్ని బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి.. మధ్యలో కారులో మహేష్ బాబు ఉన్న పోస్టర్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఇంతకీ విజన్ అంటే ఏం ఇస్తారు అన్న డౌట్ అభిమానుల్లో ఉంది. ఇప్పుడు ఎలాగూ రకరకాల పేర్లతో హంగామా చేయడం మేకర్స్ కు పరిపాటి అయింది కాబట్టి.. టీజర్ కే ఈ పేరు పెట్టి.. ఏదో చూపించబోతున్నారు అనుకుంటున్నారు. అంటే భరత్ అనే నేనుకు మార్చ్ 6న టీజర్ వస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ వినిపిస్తున్నాయి.
అయితే.. ముఖ్యమంత్రి పాత్రలో రాష్ట్రాన్ని మహేష్ ఎలా మార్చదలచుకున్నాడో అనే విజన్ ని వినిపిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే విజన్ అంటూ విజన్ అంటూ అసెంబ్లీ లోపల తతంగాన్ని కొరటాల చూపిస్తాడేమో అనుకుంటున్నారు. ఏం చూపించినా కానీ.. ఏదో ఒకటి కొత్త అంశాలు అయితే వస్తాయి కదా అని సంబరపడుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.