భరత్ అనే నేను – చూసి నేర్చుకున్నాను

Update: 2018-04-14 07:03 GMT
ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో స్టార్ హీరో సినిమా చేయటం అంటే కథ విన్నంత ఈజీ కాదు. ప్రేక్షకులను మెప్పించేలా పాత్రలో లీనం కావాలి అంటే అందులో పరకాయ ప్రవేశం చేయక తప్పని పరిస్థితి. ఏదో మొక్కుబడిగా నటించాం ఎలా ఉన్నా చూస్తారు అనుకునే రోజులు చెల్లిపోయాయి. అందుకే వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కష్టపడుతున్నారు. రామ్ చరణ్ ఏడాది పైగా గెడ్డంతో తిరగడానికి కారణం అదే. ఇప్పుడు మహేష్ కూడా భరత్ అనే నేను కోసం పెద్ద కసరత్తే చేసినట్టు కనిపిస్తోంది. మొదటి సారి సిఎం రోల్ పోషిస్తున్న మహేష్ బాబుకు ఇందులో ఛాలెంజ్ అనిపించే అసెంబ్లీ సీన్స్ ఉన్నాయట. కథకు అవే ప్రాణంగా ఉండటంతో దర్శకుడు కొరటాల శివ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గమనించిన మహేష్ ఆ సీన్స్ పండాలి అంటే నిజంగా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

కాని తనకు నేరుగా అసెంబ్లీకి వెళ్లి సెషన్స్ చూసే అవకాశం లేదు కనక యు ట్యూబ్ ని ఆయుధంగా మలుచుకున్నాడు. గతంలో వివిధ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు సభలో ఎలా వ్యవహరించారు - ప్రతిపక్షాలకు ఎలా స్పందించారు లాంటివి క్షుణ్ణంగా పరిశీలించి దానికి తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ లో మార్పులు కూడా చేసుకున్నాడట. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ మాత్రమే కాక ఇతర రాష్ట్రాల సెషన్స్ కూడా స్టడీ చేసిన మహేష్ వాటి మీద పూర్తిగా అవగాహన వచ్చాకే శివకు షూట్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాయని ఇప్పటికే టాక్ ఉంది. ట్రైలర్ అంచనాలు పెంచేయగా ఆడియో కూడా సూపర్ హిట్ కావడం యూనిట్ కాన్ఫిడెన్స్ ని పెంచింది. కేవలం ఆరు రోజులు మాత్రమే విడుదలకు మిగిలి ఉండటంతో వాటిని వేళ్ళ మీద లెక్కబెడుతూ ఎదురు చూస్తున్నారు మహేష్ ఫాన్స్. ఈ నేపధ్యంలో ఇలాంటి అప్ డేట్స్ వాళ్ళకు గూస్ బంప్స్ ఇస్తున్నాయి.
Tags:    

Similar News