ల‌గ‌డ‌పాటి కుమారుడి పెళ్లి వేడుక‌లో మహేష్

Update: 2017-11-25 12:06 GMT
కొంద‌రు టాలీవుడ్ హీరోల కుటుంబాల‌కు రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, వారు ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో ఆయా పార్టీల త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డం ప‌రిపాటి. నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు టీడీపీకి, మెగా ఫ్యామిలీల హీరోలు సంద‌ర్భానుసారంగా వివిధ పార్టీల‌కు జై కొట్టారు. అయితే, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మాత్రం అందుకు చాలా భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఆయన తండ్రి న‌ట‌శేఖర కృష్ణ గ‌తంలో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు తెలిపారు. ఆయ‌న బావ గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌స్తుతం టీడీపీ ఎంపీగా ఉన్నారు. కృష్ణ  సోద‌రుడు ఆదిశేష‌గిరిరావు వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపారు. అయినా కూడా ఇప్ప‌టివ‌ర‌కు మ‌హేష్ ఏ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌లేదు. త‌న‌కు రాజ‌కీయాల‌పై ఏమాత్రం ఆస‌క్తి లేద‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కూడా స్పష్టం చేశారు.

అయితే, రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేక‌పోయినప్ప‌టికీ మ‌హేష్ కు మాత్రం కొంత‌మంది రాజ‌కీయ నాయకుల‌తో స‌న్నిహిత సంబంధాలున్నాయి. అంతేకాదు, ఆయ‌నకు చాలామంది వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామికవేత్త‌ల‌తో కూడా స‌త్సంబంధాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కుమారుడి వివాహ వేడుక‌కు ప్రిన్స్...స‌తీస‌మేతంగా హాజ‌ర‌య్యారు. ఆ పెళ్లిలో మహేష్ దంప‌తులు సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్‌...భ‌ర‌త్ అను నేను చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌మంతుడు త‌ర్వాత కొర‌టాల‌తో మ‌రో హిట్ కొట్టాల‌ని ఈ ప్రాజెక్ట్ ను ప్రిన్స్ చాలా ప్రెస్టీజియ‌స్ గా తీసుకున్నారు. అందుకే, ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యే దాకా త‌న 25వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌టుపెట్ట‌కూడ‌ద‌ని మ‌హేష్ డిసైడైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News