మరో ప్రాణం నిలిపిన మహేష్.. చిన్నారి ఆపరేషన్ సక్సెస్!

Update: 2021-01-08 14:34 GMT
సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోలమే అనిపించుకుంటున్నారు పలువురు నటులు. అభాగ్యులను ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందే ఉంటారు ప్రిన్స్ మహేష్. ఇప్పటికే పలువురికి ఆర్థికంగా సహాయం అందించిన సూపర్ స్టార్.. తాజాగా మరో బిడ్డను ఆదుకున్నారు.

పసివాడు షేక్ రిహాన్ ఆపరేషన్ కు సాయం చేసి, ఆ ప్రాణాన్ని నిలబెట్టాడు మహేష్. అరుదైన వ్యాధితో బాధపడుతున్న రిహాన్ ఆపరేషన్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో రిహాన్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్.. వారికి సహాయం చేశారు.

అయితే.. ఆ చిన్నారి ఆపరేషన్ సక్సెస్ కావడంతో తల్లిదండ్రులతోపాటు మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు. కాగా.. ఇటీవలే ఏపీకి చెందిన ఉమా అనే మహిళ కూతురి గుండె ఆపరేషన్ కూడా చేయించి, ఆ పాపకు ప్రాణం పోశాడు ప్రిన్స్.

సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు-పరశురామ్ కాంబోలో తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఒకటి, రెండు వారాల్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News