మ‌హేష్.. మా చిరంజీవిగారి సినిమా అన్నార‌ట‌

Update: 2022-04-25 14:30 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన చిత్రం 'ఆచార్య‌' భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో న‌టించారు.  సిద్ధాగా ఆయ‌న పాత్ర‌ ధ‌ర్మ‌స్థ‌లిలోని గురుకుల్ కు సంబంధించిన వ్య‌క్తిగా ఆయన ఇందులో క‌నిపించ‌నున్నారు. కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో ఎండోమెంట్ అధికారిక‌గానూ, ఓ ద‌శ‌లో న‌క్స‌లైట్ గానూ క‌నిపించ‌నున్నారు.

'సైరా న‌రసింహారెడ్డి' వంటి చారిత్రాత్మ‌క చిత్రం త‌రువాత చిరంజీవి నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా ఇది. ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని ప్రారంభించేశారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ చిత్రంలో చిరుకు జోడీగా హీరోయిన్ కాజ‌ల్ న‌టించ‌డం లేద‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్ ప్ర‌స్తుతం షాక్ లో వున్నారు. చిరుకుజోడీ లేకుండా సినిమా ఏంట‌ని అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఇదిలా వుంటే ఈ చిత్రంలో కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న రామ్ చ‌రణ్ పాత్ర నిడివి 25 నిమిషాలు మాత్ర‌మే వుంటుద‌ని, ఆ త‌రువాత చిరు ఎంట్రీ వుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ లోనే ముందు చ‌ర‌ణ్ క‌నిపించి ఆ త‌రువాతే చిరు క‌నిపించ‌డంతో ఈ మూవీపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఇక ఈ చిత్రంలోని కీల‌క ఘ‌ట్టామైన పాద‌ఘ‌ట్టాన్ని ప‌రిచ‌యం చేస్తూ  హీరో సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ అందించిన విష‌యం తెలిసిందే.

ముందు ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ని మ‌హేష్ బాబుతో చేయించాల‌ని ప్లాన్ చేశారు. 'ట్రిపుపుల్ ఆర్‌'లో చ‌ర‌ణ్ బిజీగా వుండ‌టం వ‌ల్ల త‌ను చేయ‌డం కుద‌ర‌ద‌ని మ‌హేష్ ని అనుకున్నారు. అయితే ఆ పాత్ర‌ని చ‌ర‌ణ్ మాత్ర‌మే చేయాల‌ని చిరు స‌తీమ‌ణి సురేఖ ప‌ట్టుబ‌ట్ట‌డతో చివ‌రికి రాజ‌మౌళిని ఒప్పించి చ‌ర‌ణ్ డేట్స్ కుదిరేలా ప్లాన్ చేసి 'ఆచార్య‌'లో న‌టింప‌జేశారు. అయినా స‌రే ఈ చిత్రంలో మ‌హేష్ పాత్ర వుండాల్సిందే అని భావించిన టీమ్ చివ‌రికి ఆయ‌న చేత వాయిస్ ఓవ‌ర్ చెప్పించారు.

ఇది ఎలా కుదిరిందిన్న‌ది ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వెల్ల‌డించారు. సినిమాలోని టెంపుల్ సిటీని అభివ‌ర్ణిస్తూ రెండు నిమిషాల పాటు ఓ స్టోరీ వుంటుంది. ఆ క‌థ చెబుతూ 'ఆచార్య‌' ప్ర‌పంచంలో కి ప్రేక్ష‌కుల‌ని తీసుకెళ్లాలి. దీనికి తెలిసిన వ్య‌క్తి వాయిస్ అయితే బాగుంటుంద‌ని, అలాగే స్టార్ స్టేట‌స్ వున్న న‌టుడైతే బాగుంటుంద‌ని భావించాం. ఇదే విష‌యాన్ని మ‌హేష్ గారికి చెబితే మా చిరంజీవిగారి సినిమా అండి అన్నార‌ని' ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ చెప్పుకొచ్చారు.

చిరు మాట్లాడుతూ 'అంత‌కు ముందు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' ఆడియో ఫంక్ష‌న్ కి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నాను. ఆ సంద‌ర్భంలో మ‌హేష్.. నేను, న‌మ్ర‌త ఫార్మ‌ల్ గా ఇంటికి వ‌చ్చి మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తామ‌ని చెప్పాడు. అంత ఫార్మాలిటీ ఎందుకు ఫోన్ చేస్తే చాలు వ‌చ్చేస్తాన‌ని నేను ఆ ఫంక్ష‌న్ కి వెళ్లాను. నేను ఎలా నా బాధ్య‌త‌ల‌గా వాళ్లు పిల‌వ‌గానే ఫంక్ష‌న్ కి వెళ్లానో మహేష్ కూడా కొర‌టాల అడ‌గ్గానే అంతే బాధ్య‌త‌గా భావించి వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డం ఆనందంగా వుంది. ఇండ‌స్ట్రీలో మ‌నంద‌రం ఒక‌టి అనేలాగా ఇలాంటి ఇచ్చుపుచ్చుకోవ‌డం అనే ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం వుండాలి' అన్నారు మెగాస్టార్‌.
Tags:    

Similar News