తనకో ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి ఓ హీరో ఒప్పుకోవడమే ఆశ్చర్యం. అలాంటిది మళ్లీ ఆ దర్శకుడిని నమ్మి సొంతంగా ఇంకో సినిమా చేయడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే ఆ రెండో సినిమా కూడా ఆడకపోతే మళ్లీ అదే దర్శకుడితో మూడో సినిమా చేయడం చాలా అరుదైన విషయం. తెలుగులో ఈ తరం హీరోల్లో ఇలాంటి సాహసం చేసిన ఏకైక కథానాయకుడు ఒక్క కళ్యాణ్ రామ్ మాత్రమే. తనకు అభిమన్యు, కత్తి లాంటి ఫ్లాప్ సినిమాలు అందించిన మల్లికార్జున్ తో మూడో సినిమా చేస్తున్నాడు నందమూరి హీరో. కళ్యాణ్ రామ్ నమ్మకమే ‘షేర్’ సినిమా అంటూ ఆడియో ఫంక్షన్లో ఉద్వేగానికి లోనయ్యాడు మల్లి. మరి కళ్యాణ్ రామ్ అంత నమ్మినందుకైనా ‘షేర్’ సినిమా హిట్టవుతుందేమో చూడాలి.
‘అభిమన్యు’తో పోలిస్తే ‘కత్తి’ మంచి సినిమానే. మల్లికార్జున్ ఆ సినిమాలో తన ప్రతిభ చూపించాడు. ఐతే రాంగ్ టైమింగ్ లో రిలీజ్ కావడం, ఇంకొన్ని కారణాలు కలిసి ఆ సినిమా ఆడలేదు. ఐతే ‘షేర్’ మంచి టైమింగులోనే వస్తోంది. ‘పటాస్’ లాంటి సూపర్ హిట్ తర్వాత రిలీజ్ కావడం దీనికి కలిసొచ్చే అంశం. పైగా రిలీజ్ టైంలో పెద్దగా పోటీ కూడా లేదు. సినిమా మీద హైప్ బాగానే ఉంది. మరి ఇంతటి అనుకూల పరిస్థితుల్లో వస్తున్న ‘షేర్’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.