మలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు క్రేజీ హీరోయిన్ లుగా పేరు తెచ్చుకున్న చాలా మంది హీరోయిన్ లు క్యాన్సర్ బారిన పడి సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అందులో చాలా మంది క్యాన్సర్ తో పోరాడి ఫైనల్ గా విజయం సాధించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారు చాలా మందే వున్నారు. అందులో మళయాల హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఒకరు. మలయాళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపుని సొతంం చేసుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. గతంలో క్యాన్సర్ తో పోరాటం చేసి సినిమాలకు దూరమైంది.
చివరికి క్యాన్సర్ ని జయించి దాని బారిన పడిన వారికి అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఎంతో మందిని స్ఫూర్తిగా నిలిచింది. మమతా మోహన్ దాస్ తరహాలోనే మనీషా కోయిరాలా, లిసారే, సొనాలీ బింద్రే, మహిమా చౌదరి, హంసా నందిని క్యాన్సర్ తో పోరాడి ఫైనల్ గా విజయం సాధించారు. మళ్లీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ ను జయించి మళ్లీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది.
తను నటించిన చాలా వరకు మళయాల సినిమాలు తెలుగులోనూ అనువాదం అయి విజయం సాధంచాయి కూడా. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన `జన గణ మన`లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ మూవీతో సక్సెస్ ని సొంతం చేసుకున్న మమతా మోహన్ దాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. కొన్నేళ్ల విరామం తరువాత తెలుగులో `రుద్రాంగి` మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా వుంది మమతా మోహన్ దాస్.
ఇదిలా వుంటే మమతా మోహన్ దాస్ ఆరోగ్యం మళ్లీ ఇబ్బందికరంగా మారిందని, మళ్లీ తను క్యాన్సర్ బారిన పడిందంటూ ప్రచారం మొదలైంది. దీనిపై మమతా మోహన్ దాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంది. ఈ వార్తలు చూసి నా అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురవుతున్నారంది.
ఇటీవల తనతో మాట్లాడామంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి తప్పుడు వార్తలని సృష్టిస్తున్నారని, నా ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. తను క్యాన్సర్ బారిన పడలేదని, అలాంటి తప్పుడు వార్తలని అభిమానులు, సన్నిహితులు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.