సుధీర్‌బాబుతో ‘మనం’ రచయిత
బుల్లి తెర పై నటుడి గా, రచయిత గా, దర్శకుడి గా మంచి పేరు తెచ్చుకున్న హర్ష వర్ధన్ ‘మనం’ మరియు ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలతో మంచి రచయితగా గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ‘మనం’ చిత్రంతో హర్షవర్ధన్ తో వర్క్ చేసేందుకు పలువురు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. రచయితల్లో ఎక్కువ శాతం దర్శకత్వం పై ఆసక్తి చూపుతూ ఉంటారు. అందరిలాగే హర్షవర్ధన్ కూడా దర్శకుడి గా పరిచయం అయ్యాడు. శ్రీముఖి హీరోయిన్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో రెండవ సినిమాకు టైం తీసుకున్నాడు.
ఎట్టకేలకు హర్షవర్ధన్ రెండవ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా సుధీర్ బాబుతో ఒక చిత్రాన్ని చేసేందుకు స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే స్టోరీ లైన్ కు సుధీర్ బాబు ఓకే చెప్పాడని, త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు.
సుధీర్ బాబు ఆమద్య ‘సమ్మోహనం’ చిత్రం తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సక్సెస్ జోష్ లో ఉన్న సుధీర్ బాబు కు హర్ష వర్ధన్ ఎలాంటి సినిమాను ఇస్తాడో చూడాలి. రచయితగా మంచి పేరు ఉన్న పలువురు దర్శకులుగా కూడా సూపర్ హిట్స్ ను అందుకున్నారు. అందుకే హర్ష వర్ధన్ కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.