తారక్ కి మొగుడు ఎవరో తెలుసా?

Update: 2017-06-04 05:48 GMT
మంచు మనోజ్.. జూనియర్ ఎన్టీయార్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. చీటికీ మాటికీ ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేంత ఫ్రెండ్ షిప్ వీరికి ఉంది. రీసెంట్ తాను ఎన్టీఆర్ ఇంటికి వెళ్లినపుడు జరిగిన ఓ సంఘటన గురించి.. ఒక పిక్ ద్వారా తెలియచేశాడు మంచు మనోజ్. అంతే కాదు.. ఎన్టీఆర్ కి కౌంటర్ కూడా వేసేశాడు.

చిన్నపాటి సర్ ప్రైజ్ విజిట్ ప్లాన్ చేసి.. ఎన్టీఆర్ ఇంటికి వెళితే అక్కడ మంచు మనోజ్ కి.. ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ స్వాగతం పలికాడు. అంతే కాదు.. నీళ్లు కావాలా అని అడిగి మరి.. ఫ్రిజ్ లోంచి చిల్డ్ వాటర్ ను ఓ గ్లాస్ లో పోసుకుని పట్టుకొచ్చాడట. ఇక్కడి వరకూ అందరూ చేస్తారు కానీ.. ఎంతైనా ఎన్టీఆర్ కొడుకు కదా.. అందుకే ఆ గ్లాస్ ను మనోజ్ నోటికి అందించి మరీ తాగిస్తున్నాడు. గ్లాస్ వదలమన్నా సరే.. అభయ్ రామ్ అస్సలు వదలనే లేదట. ఈ ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు మంచు మనోజ్.

'చిల్డ్ వాటర్ నాకు ఇంటిలోకి స్వాగతం పలికాడు. తారక్ కి కరెక్ట్ మొగుడు నా బుజ్జి అభయ్ కుట్టి. ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు 100 రెట్లు పెరిగిపోయాయి' అన్నాడు మంచు మనోజ్. గ్లాసుడు చల్లని నీరు తాగిన మనోజ్ కి ఎనర్జీ 100 రెట్లు పెరిగితే.. అనుకోకుండా అభయ్ ఫోటో చూసే అవకాశం రావడంతో.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. మంచు మనోజ్ కు బోలెడన్ని థ్యాంక్స్ చెప్పేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News