తన కొడుకు మంచు విష్ణు మీద ఇప్పటిదాకా చాలా పెట్టుబడి పెట్టారు మోహన్ బాబు. ఐతే ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే ఆయనకు లాభాలు తెచ్చిపెట్టలేదు. కెరీర్ ఆరంభంలో విష్ణు నాలుగైదు సినిమాలు సొంత బేనర్లోనే చేయగా.. అవన్నీ దారుణమైన ఫలితాన్నిచ్చాయి. ఐతే తొలిసారి బయటి బేనర్లో ‘ఢీ’ చేస్తే అది చాలా పెద్ద హిట్టయింది. ఆ తర్వాత మళ్లీ సొంత బేనర్లో చేసిన చాలా సినిమాలు ఫ్లాపయ్యాయి. దేనికైనా రెడీ.. దూసుకెళ్తా.. లాంటి ఒకట్రెండు సినిమాలు మాత్రం బాగా ఆడాయి. ఆ తర్వాత మళ్లీ సొంత బేనర్లో వరుసగా ఎదురు దెబ్బలే తగిలాయి. గత ఏడాది చేసిన ‘డైనమైట్’ కూడా దారుణమైన ఫలితాన్నే ఇచ్చింది.
ఆ సినిమా తర్వాత ఓ పంజాబీ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని.. సొంత బేనర్లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు విష్ణు. ఆ సినిమానే ‘ఈడోరకం ఆడోరకం’. ఐతే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ సినిమా అనుకోకుండా అనిల్ సుంకర చేతికి వచ్చింది. రీమేక్ రైట్స్ కోసం ఎంత చెల్లించారో అంత ఇచ్చేసి తనే ఈ సినిమాను నిర్మించాడు అనిల్. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమాను అనుకోకుండా హిట్ టాక్ సంపాదించుకుంది. రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పెట్టుబడి మీద రెట్టింపు వసూలు చేసేలా కనిపిస్తోంది. శాటిలైట్ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ వచ్చేలా ఉంది. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసిన అనిల్ బాగానే వెనకేసుకోబోతున్నాడు. దీంతో తమ ఖాతాలో పడాల్సిన హిట్టు బయటి నిర్మాతకు వెళ్లిపోయిందే అని ఫీలయ్యే పరిస్థితిలో ఉంది మంచు ఫ్యామిలీ.