మాయ చేసేంత స్టామినా ఉందా?

Update: 2016-06-18 09:21 GMT
అక్కినేని నాగ చైతన్య ఓ కొత్త భామను టాలీవుడ్ కి తెస్తున్నాడు. అది కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి పట్టుకొస్తున్నాడు. లవర్ బోయ్ ఇమేజ్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే ఈ అక్కినేని హీరో.. ఓ కొత్తమ్మాయిని పట్టుకొస్తున్నాడని తెలియగానే ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.

నిజానికి చైతు ఇలా కొత్తమ్మాయిని తీసుకురావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇప్పటి టాప్ హీరోయిన్ అయిన సమంతను కూడా చైతు ఇలాగే తీసుకొచ్చాడు. ఏం మాయ చేశావే మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శామ్స్. అది కూడా గౌతమ్ మీనన్ మూవీనే కావడం అసలు పాయింట్. ఇఫ్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరు హీరోలతో రూపొందిన ఈ మూవీని.. సరైన డేట్ చూసుకుని విడుదల చేసేందుకు నిర్మాతలు ట్రై చేస్తున్నారు.

రీసెంట్ గా జరిగిన సాహసం శ్వాసగా సాగిపో ఆడియో ఫంక్షన్ లో మంజిమా మోహన్ ని చూస్తే.. అప్పటి సమంత గుర్తు రాలేదన్న మాట మాత్రం వాస్తవం. పొట్టిపొట్టిగా బట్టలేసుకొచ్చినా... ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో సామ్స్ చూపించి చాతుర్యం మాత్రం ఈమెలో లేలుద. పైగా బొద్దుగా ఉన్న బాడీ కావడంతో... స్కిన్ షో చేసే అవకాశం కూడా అంతగా లేదు. గ్లామర్ విషయంలో నెగిటివ్ పాయింట్స్ ఉన్న ఈ సుందరాంగి.. పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం మంచి మార్కులు వేయించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.
Tags:    

Similar News