విక్టరీ వెంకటేష్ తో సెన్సేషనల్ డైరెక్టర్ మారుతీ.. ఓ పిక్చర్ తీయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ మూవీకి టైటిల్ పెట్టే పనిలో పడ్డాడు దర్శకుడు. గతంలో ఓసారి రాధా అనే మూవీ ఆగిపోవడంతో.. దాన్నే కొంచెం మార్చి రాధాకృష్ణ అనే టైటిల్ పెడతారనే వార్తలొచ్చాయి. అఫ్ కోర్స్ వీటిని అప్పుడే ఖండించాడు మారుతీ.
ఇప్పుడు వెంకీతో తీయబోతున్న మూవీకి నాలుగు టైటిల్స్ అనుకుంటున్నాడు డైరెక్టర్. "బాబూ బంగారం" - "డైమండ్ రాజా" - "రాజా రత్నం" - "24 కేరట్ బంగారం".. ఇవీ మారుతీ ఫైనల్ చేసిన టైటిల్స్. ఇందులో ఏదైనా సరే స్టోరీకి సరిగ్గా సరిపోతుందని తెలుస్తోంది. వీటిలో ఏదో ఒక దాన్ని ఫైనల్ చేయాల్సిందిగా వెంకీకి మారుతు సూచించాడు. అయితే టైటిల్ ఇప్పుడే డిసైడ్ చేసే ఉద్దేశ్యంలో వెంకీ లేడని తెలుస్తోంది. పిక్చరైజేషన్ స్టార్ట్ చేశాక.. కేరక్టర్స్ - ఎమోషన్స్ ను పేరు ఫిక్స్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడట వెంకటేష్.
ఈ నెల 16న మారుతీ-వెంకీల కాంబినేషన్ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ మూవీ చేయని వెంకీ.. మారుతీ ప్రాజెక్ట్ ను మాత్రం శరవేగంగా కంప్లీట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడు. సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత కాగా.. ఎస్.రాధాకృష్ణ సమర్పకుడు.