ఈ రోజుల్లో - బస్ స్టాప్ లాంటి సినిమాలతో మారుతి కలెక్షన్ల వర్షం కురిపించి ఉండొచ్చు. కానీ వాటితో పాటు బోలెడంత చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడతను. బూతు డైరెక్టర్ అని.. హద్దులు దాటిన బూతులతో తెలుగు సినిమాలకు చెడ్డ పేరు తెచ్చాడని అతడిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ‘బస్ స్టాప్’ విషయంలో మారుతిపై వచ్చిన విమర్శలన్నీ ఇన్నీ కావు. కానీ అలాంటి వాడే ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశాడు. మరి ఇంత మంచి సినిమా తీయగలిగినవాడు.. ముందు ఆ టైపు సినిమాలు ఎందుకు తీశాడని సందేహం కలగడం ఖాయం. ఐతే అందుకు కారణం లేకపోలేదంటున్నాడు మారుతి.
తనకు అవకాశాలివ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే.. ప్రేక్షకుల్ని - నిర్మాతల్ని ఆకర్షించడానికి ఆ తరహా సినిమాలు చేయాల్సి వచ్చిందంటున్నాడు మారుతి. ‘‘పాతిక లక్షలు పెడితే సినిమా తీసి పెడతానని చాలామందిని అడిగాను. కానీ ఎవ్వరూ అవకాశమివ్వలేదు. అలాంటి సమయంలో నేను లాభాలు తెచ్చిపెట్టగలనని చాటడానికి.. జనాల దృష్టిని ఆకర్షించడానికి ఈ రోజుల్లో, బస్ స్టాప్ తీయాల్సి వచ్చింది. ఇప్పుడు నా అసలు శైలిని జనాలకు చూపిస్తున్నా. నిజానికి నా శైలే ఇది. కానీ అప్పట్లో అవసరం కోసం అలాంటి సినిమాలు చేశాను. ఇకపై క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లే తీస్తా’’ అని చెప్పాడు మారుతి.