మీ పెళ్లాం పిల్లలకు ఇలా జరిగితే ఊరుకుంటారా?

Update: 2020-08-02 23:30 GMT
కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌ సెబ్రెటీలపై శ్రీరెడ్డి ఏ స్థాయిలో విమర్శలు చేసి అటెన్షన్‌ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కొందరు స్టార్స్‌ పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆమె గురించి జనాల్లో చర్చ మొదలైంది. ఇప్పుడు కోలీవుడ్‌ లో కూడా ఒక శ్రీ రెడ్డి రెడీ అయ్యింది. గత కొంత కాలంగా మీరా మిథున్‌ కోలీవుడ్‌ స్టార్స్‌ పై చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. త్రిష మరియు ఐశ్వర్య రాయ్‌ లు తన స్టైల్‌ ను తన బాడీలాంగ్వేజ్‌ ను తన కాస్ట్యూమ్స్‌ ను కాపీ చేశారంటూ ట్రోల్స్‌ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రజినీకాంత్‌ విజయ్‌ ఇంకా కొందరు కోలీవుడ్‌ స్టార్స్‌ పై కూడా విమర్శలు గుప్పించింది.

తమిళ హీరోలు సూర్య మరియు విజయ్‌ లపై ఈమె చేసిన కామెంట్స్‌ కు సమాధానంగా చాలా సీరియస్‌ గా అభిమానులు ఈమెను టార్గెట్‌ చేశారు. అసభ్యకర పదజాలంతో అభిమానులు ఆమెను ట్రోల్స్‌ చేయడంతో ఆమె చాలా రోజులుగా వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూనే ఉంది. తాజాగా సూర్య మరియు విజయ్‌ లతో పాటు ఇతర హీరోలను కూడా టార్గెట్‌ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మీ ఇంట్లో వారు అయిన భార్య పిల్లలకు ఇలాంటి వేదింపులు వస్తే మీరు మౌనంగా ఉంటారా. మీ ఇంట్లో వారికి ఇలాంటి అసభ్యకర కామెంట్స్‌ వస్తే మీరు ఊరుకుంటారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మీ అభిమానులు నన్ను ఇంతగా ట్రోల్స్‌ చేసినా కూడా మీరు స్పందించక పోవడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Tags:    

Similar News