సినీ ఇండస్ట్రీలో నటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటివేమైనా ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎక్కడైనా ఒకరినొకరు తారసపడ్డా చిరునవ్వులతో ఆలింగనం చేసుకుంటారు. తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందంటారు. అయితే వారి అభిమానులు మాత్రం తరచూ గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు దూషించుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటారు కూడా. 'మేము మేము బాగానే ఉంటాం.. కానీ మీరే' అంటూ వాళ్లే డైరెక్టుగా చెప్పిన గొడవలు మాత్రం ఆపరు. ఇక మెగా, నందమూరి హీరోల విషయానికొస్తే బయట సన్నిహితంగానే ఉంటారు. అప్పుడప్పుడు ఒకరినొకరు విమర్శించుకున్నా అది అప్పటికప్పుడే. కానీ ఈ హీరోల అభిమానులు మాత్రం బయట తెగ గొడవలు పడేస్తుంటారు. దశాబ్దాలుగా ఈ అభిమానుల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది చిరంజీవి, బాలయ్యల మధ్య బాక్సాఫీస్ పోరు మొదలైనప్పటి నుంచి ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేసినా కూడా అభిమానుల గొడవలు ఆగట్లేదు. ఈ సినిమాలో ఎవరు ఎక్కువ హైలైట్ అవుతారు.. ఎవరి పాత్ర బాగుంటుంది.. సినిమా హిట్టయితే ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి అనే విషయాల్లో ఏడాది కిందట్నుంచి సోషల్ మీడియా లో తెగ కొట్టేసుకుంటున్నారు ఇరు వర్గాల అభిమానులు.
వివరాల్లోకి వెళ్తే దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ తో చేస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వార్ కి కారణమైంది. ఇందులో చరణ్‌ను నిప్పులా చూపిస్తే.. ఎన్టీఆర్ ను నీటితో పోల్చారు. ఐతే నిప్పే గొప్పని చరణ్ ఫ్యాన్స్ అంటుంటే.. నీటికే శక్తి ఎక్కువ అని తారక్ అభిమానులు వాదిస్తున్నారు. ఇది కాక టైటిల్ లోగోలో చరణ్ ను ముందు పెట్టి, తారక్ ను వెనుక పెట్టడం గురించి కూడా చర్చ నడుస్తోంది. రాజమౌళి చరణ్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడని తారక్‌కు తగ్గించాడని కొందరంటే.. మోషన్ పోస్టర్లో తారక్ కే ఎక్కువ హైలైట్ అయ్యాడని ఇంకొందరు అంటున్నారు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మోషన్ పోస్టర్‌కే ఇలా కొట్టేసుకుంటే ఇక సినిమాలో వివిధ అంశాల మీద ఎలా గొడవ పడతారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.