మెగా బాయ్స్‌ అంతా గ్యాంగ్‌ లీడర్‌ స్టెప్‌

Update: 2016-03-29 13:49 GMT
రెండు రోజుల క్రితం అసలు బెంగుళూరులో జరిగిన మెగా సంగీత్‌ లో ఏం జరిగిందో ఒక్కో క్లిప్‌ రూపంలో బయటకు వస్తుంటే.. అభిమానులకు మతిపోతోంది అంతే. అఫీషియల్‌ గా మెగా ఫ్యామిలీ ఈ విషయాలు ఎక్కడా ప్రస్తావించకపోయినా కూడా.. ఎక్కడో చోట ఏదో ఒకటి బయటకు పొక్కుతూనే ఉంది.

ఇప్పటికే అబ్బనీ తీయనీ దెబ్బ వంటి పాటలకు శ్రీజ అండ్‌ కళ్యాణ్‌ లు డ్యాన్సు వేయడం.. అలాగే చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితతో కలసి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వగైరా పాటలకు స్టెప్పులు వేయడం ఫుల్‌ కిక్కిచ్చేసింది. ఇకపోతే ఇప్పుడు యంగ్ మెగా హీరోల వంతొచ్చింది. రామ్‌ చరణ్‌ తో కలసి.. బన్నీ.. సాయిధరమ్‌.. వరుణ్‌ తేజ్‌ అండ్‌ శిరీష్‌ లు కూడా రచ్చ లేపేశారు. అందరూ కలసి.. జి.. ఏ.. ఎన్‌.. జి.. గ్యాంగ్‌ గ్యాంగ్‌ అంటూ గ్యాంగ్‌ లీడర్‌ టైటిల్‌ సాంగుకు ఒక స్టెప్పేశారు. ఇరగదీశారు అంతే. ఇక చివర్లో వీరి నిజమైన గ్యాంగ్‌ లీడర్‌ చిరంజీవి కూడా గ్యాంగులో చేరారు. అందరికీ ఒక హగ్‌ ఇచ్చారు.

మొత్తానికి ఈ సంగీత్‌ పార్టీని మెగా బాయ్స్‌ అండ్ గాళ్స్‌ ఊర్రూతలూగించారనే చెప్పొచ్చు.

Full View
Tags:    

Similar News