వారసుల కోసం మెగాస్టార్ మెగా స్క్రీన్ ప్లే

Update: 2016-04-15 09:30 GMT
ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల సంఖ్య చాలానే ఉంది. వీళ్లంతా తమ సినిమా ప్రమోషన్స్ కోసమే కాదు.. సినిమాల్లోనూ చిరంజీవిని తెగ వాడేస్తూ ఉంటారు. మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించడానికి చిరు ఇమేజ్ ని ఉపయోగించుకుంటారు.

అయితే.. ఇది ఆన్ స్క్రీన్ పై మొదలయ్యే వ్యవహారం కాదు. ఏ సినిమా చేయాలనే డెసిషన్ దగ్గర నుంచి, ఎవరితో చేయాలి - స్టోరీ నిర్ణయం - రషెస్ చూపించడం - ఔట్ పుట్ లో ఏదన్నా తేడాలుంటే మార్చడం - రీషూట్స్ చేయడం లాంటివన్నీ మెగాస్టార్ ఆదేశానుసారం జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని ఆయా మెగా హీరోలంతా స్టేజ్ పై చూచాయగా చెబుతూ ఉంటారు. చిరు సలహా తీసుకున్నానని బన్నీ అన్నా - సుప్రీం టైటిల్-స్టోరీ విషయంలో పెద్ద మామయ్య పర్మిషన్ తీసుకున్నానని తేజు చెప్పినా.. అసలు కథ ఇదే.

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తనకు నచ్చిన స్టోరీలను - తాను కనెక్ట్ అయిన డెైరెక్టర్లతోనే తీస్తూ ఉంటాడు. అన్నయ్యని సలహాలు అడిగే అలవాటు పవర్ స్టార్ కి లేదట. ఏవన్నా ఒకటీ అరా సీన్స్ కి సంబంధించిన రషెస్ చూపించడం తప్ప.. నిర్ణయాలు మాత్రం తనే తీసుకుంటాడట పవన్.
Tags:    

Similar News