మెగా హీరోల చుట్టూ ఫ్లాపు డైరక్టర్లే

Update: 2016-04-21 17:30 GMT
ఇప్పటికే బ్రూస్‌ లీ.. సర్దార్‌.. మధ్యలో సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ అండ్‌ లోఫర్‌.. ఇలా వరుసగా మెగా సినిమాలన్నీ అయితే అట్టర్‌ ఫ్లాపులు.. లేకపోతే జస్టు గీత దగ్గరకు వచ్చి ఆగిపోయిన యావరేజ్‌ సినిమాలుగానే మిగిలిపోయాయ్‌. అయితే ఈ ఫ్లాప్‌ ఫీట్‌ ను సరైనోడు రిపీట్‌ చేస్తాడో లేదో తెలియదు కాని.. అసలు కమింగ్‌ డేస్‌ లో మెగా హీరోలు మాత్రం కేవలం ఫ్లాపు దర్శకులతోనే పనిచేస్తున్నారు తెలుసా?

అవును.. అఖిల్‌ తో అట్టర్‌ ఫ్లాప్‌ కొట్టిన వివి వినాయక్‌ తో మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ సినిమా చేస్తున్నారు. ఇక కిక్‌ 2తో బీభత్సమైన స్ర్టోక్‌ తిన్న సురేందర్‌ రెడ్డి.. రామ్‌ చరణ్‌ తో తని ఒరువన్‌ రీమేక్‌ చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఫ్లాపు సినిమాలే తీస్తున్న ఎస్.జె.సూర్య ఇప్పుడు పవన్‌ కళ్యాణ్ ను కన్విన్స్‌ చేసి.. ఆ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. బన్నీ కూడా ఇదే దోవలో వెళుతూ.. సూర్యతో భారీ ఫ్లాపైన శికందర్‌ తీసిన లింగుస్వామితో బైలింగువల్‌ చేస్తున్నా అంటూ ఇవాళే ప్రకటించాడు. ఇదంతా ఒకెత్తయితే.. భారీ ఫ్లాపుతో నెగిటివ్‌ నేమ్‌ తెచ్చుకున్న శ్రీను వైట్ల యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌ తో.. అలాగే రైటర్‌ గా ఫ్లాపవుతూ అప్పుడెప్పుడో ఒక అట్టర్‌ ఫ్లాప్‌ తీసిన బి.వి.ఎస్‌.రవి మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తో.. సినిమాలు చేస్తున్నారు. ఏం.. అల్లు శిరీష్‌ ఏమన్నా తక్కువా.. మనోడు కూడా సోలో వంటి ఫ్లాపులు తీసిన పరశురామ్‌ తోనే సినిమా చేస్తున్నాడు.

మొత్తానికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా ఫ్లాపు డైరక్టర్లనే ఎంకరేజ్‌ చేస్తున్నారనమాట. గతంలో 90వ దశకంలో రాఘవేంద్రరావు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పిలిచి మరీ ఆయనకు తాను దగ్గరుండి తయారు చేయించిన జగదేక వీరుడు అతిలోక సుందరి స్ర్కిప్టును ఇచ్చారు చిరంజీవి. పంపిణీదారులు వద్దన్నా కూడా.. ఆయన సదరు ఛాన్సిచ్చారు.. ఆ తరువాత దర్శకేంద్రుడు సూపర్‌ హిట్టు కొట్టి చూపించారు. ఇప్పుడు ఈ దర్శకులు కూడా అలాగే తమకు హిట్టిస్తారని మెగా హీరోల అంచనా కాబోలు.
Tags:    

Similar News