మెగా అల్లుడిని ఒంటరిని చేసేశారుగా..?

Update: 2022-01-14 16:34 GMT
మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మెగా బ్రాండ్ తో వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి.. టాలీవుడ్ లో నిలదొక్కుకోడానికి బాగా కష్టపడుతూ వచ్చారు. ఒకరికొకరు సపోర్టుగా నిలుస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక 'మెగా' ట్యాగ్ తో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే.

'విజేత' అనే సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా లాంచ్ చేయడానికి మెగా ఫ్యామిలీ అంతా తమ వంతు మద్దతు ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ ''సూపర్ మచ్చి'' అనే చిత్రాన్ని లైన్ లో పెట్టారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'సూపర్ మచ్చి' చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించగా.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మించారు. ఇందులో కళ్యాణ్ దేవ్ సరసన రచిత రామ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీ పండుగ సీజన్ లో థియేట్రికల్ రిలీజ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కు కూడా తెలియలేదంటే.. సినిమా ప్రమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న మిగతా మూడు సినిమాలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే.. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' సినిమా సౌండ్ మాత్రం ఎక్కడా వినబడకపోవడం సినీ అభిమానులను ఆశ్చర్య పరిచింది. 'విజేత' చిత్రాన్ని ప్రమోట్ చేసిన మెగా హీరోలు.. కళ్యాణ్ రెండో సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు 'హీరో' 'రౌడీ బాయ్స్' చిత్రాలకు మాత్రం మెగా హీరోలు తమ మద్దతు తెలపడం గమనార్హం. 'మెగా' బ్రాండ్ లేకుండా నిరూపించుకోవాలని కల్యాణ్ దేవ్ అనుకున్నాడో.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ.. 'సూపర్ మచ్చి' సినిమా మాత్రం డెడ్ ఓపెనింగ్స్ తో విడుదలైంది. మెగా సపోర్ట్ ఉంటే టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా వరకు అది జరగలేదు.

మెగా అల్లుడు రెండో సినిమాతో సూపర్ సక్సెస్ అవుతారని ఆశించిన అభిమానులు కూడా ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక 'సూపర్ మచ్చి' చిత్రంతో తెలుగులో రాణిద్దామనుకొని కోటి ఆశలతో కన్నడ నుంచి ఇక్కడకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రచిత రామ్ కి తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పాలి.
Tags:    

Similar News