మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కొరటాల శివ ఇప్పటి వరకు అపజయం ఎరుగలేదు. కనుక ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా ఖచ్చితంగా మెగా అభిమానులకు భారీ విజయాన్ని ఇవ్వబోతుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింత భారీగా ఉన్నాయి.
ఆచార్య సినిమా కంటే ముందుగా రామ్ చరణ్ తో ఒక సినిమాను చేసేందుకు కొరటాల శివ సిద్దం అయ్యాడు. కొరటాల శివ కథ తీసుకుని చిరంజీవి వద్దకు వెళ్లి చరణ్ కోసం అన్నట్లుగా వివరించాడట. అయితే చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కమిట్ అయ్యి ఉండటం వల్ల ఇప్పట్లో అతడు ఖాళీ అయ్యే అవకాశం లేదు.. మొదట మనం ఇద్దరం ఒక సినిమా చేద్దామని చిరంజీవి స్వయంగా కొరటాలతో అన్నాడట.
ఆ విషయాన్ని తాజా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా చిరంజీవి చెప్పుకొచ్చాడు. చిరంజీవి ఒక సినిమా చేద్దాం అంటూ చెప్పిన వెంటనే కొరటాల శివ అప్పటికే తన వద్ద ఉన్న కథకు మెరుగులు దిద్ది తీసుకు వచ్చాడట. ఆచార్య కథ చిరంజీవికి బాగా నచ్చడంతో వెంటనే సినిమాను పట్టాలెక్కించారు. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సమయంలో చరణ్ తో కూడా కొరటాల శివ మూవీ ఉంటుందని చిరంజీవి మాటల ద్వారా క్లారిటీ వచ్చింది.
ఆచార్య సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జూన్ నెలలో సినిమాను పట్టాలెక్కించేందుకు కొరటాల మరియు ఎన్టీఆర్ లు రెడీ అయ్యారు. ఎన్టీఆర్ తో కొరటాల శివ చేయబోతున్న సినిమా కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఆ వెంటనే కొరటాల శివ తదుపరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది చివర్లో కొరటాల శివ తదుపరి సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా చరణ్ తో అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆచార్య సినిమాకు ముందు చరణ్ కోసం కొరటాల శివ రెడీ చేసిన కథ తో ఆసినిమా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. కథ ఏదైనా చరణ్ తో కొరటాల శ్రీమంతుడు తరహా సినిమా చేయడం మాత్రం పక్కా.