రియల్ స్టార్ శ్రీహరి స్టార్ హీరోల చిత్రాలకు ఒకప్పుడు కొండంత అండగా వుండేవారు. తనదైన మార్కు నటన.. ఆహార్యంతో ఆకట్టుకుని సినిమాకు తన వంతు బాధ్యతని నిర్వర్తించి సినిమా విజయానికి తన బాధ్యతని నెరవేర్చేవారు. కానీ అలాంటి అండ ఆయన తనయుడు మేఘాంశ్ కు లేకుండా పోయింది. శ్రీహరి మరణంతో అతని కటుంబానికి పెద్ద అండ లేకుండాపోయిందన్న ముచ్చట పరిశ్రమ వర్గాల్లో సాగుతోంది. ఇదే మేఘాంశ్ కెరీర్ కి పెద్ద మైనస్ గా మారుతోంది. స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ ని హీరోగా పరిచయం చేస్తూ `రాజ్ దూత్` పేరుతో ఓ చిత్రం సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలే విడుదలైంది. కానీ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో సెలబ్రిటీ ప్రచారం దక్కకపోవడంపై చర్చ సాగుతోంది.
ఈ శుక్రవారం మరో రెండు సినిమాలతో పోటీపడుతూ ఈ చిత్రం రిలీజైంది. సందీప్ కిషన్ నటించిన `నిను వీడని నీడను నేనే` - విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ - రాజశేఖర్ చిన్ని కూతురు శివాత్మిక కలిసి నటించిన `దొరసాని` చిత్రాలతో పాటు శ్రీహరి చిన్నకుమారుడు మేఘాంశ్ నటించిన `రాజ్ దూత్` విడుదలైంది. అయితే ఆ రెండు చిత్రాలకు వున్న పబ్లిసిటీ - హంగామా ఈ సినిమాకు ఏ మాత్రం లేదు. పబ్లిసిటీని చాలా సింపుల్ గా కానిచ్చేసిన చిత్ర బృందం రిలీజ్ కి ముందు.. తరువాత సినిమాను పట్టించుకోలేదు. ప్రాపర్ గా పబ్లిసిటీని ప్లాన్ చేయలేకపోవడం మైనస్ గా మారిందన్న ముచ్చటా సాగుతోంది.
రియల్ స్టార్ వారసుడు అంటూ అంటూ ప్రేక్షకుల్లో సింపతీని రైజ్ చేయలేకపోవడం మరో మైనస్ అన్న టాక్ వినిపిస్తోంది. దాంతో రాజ్ దూత్ కి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇదే రియల్ స్టార్ శ్రీహరి వుంటే మేఘాంశ్ సినిమా టాక్.. పరిస్థితి మరోలా వుండేది. స్టార్స్ ని పిలిచి పబ్లిసిటీ ఓ రేంజ్ లో చేసేవారు. ఆ హంగామా వేరుగా వుండేది. తదుపరి సినిమా విషయంలో అయినా చిత్ర బృందం ఆ వైపు ఆలోచిస్తారేమో చూడాలి. ఇకపోతే ఈ సినిమాని కేవలం 2.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తోంది. ఆ మేరకు రిటర్న్స్ తేగలరా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.