చిరుత బ్యూటీ.. సోకుల విందు.. పరువాల పసందు..!

Update: 2022-11-11 09:42 GMT
చిరు తనయుడు చిరుతతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ ఆ మూవీలో మెప్పించినా ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు. వరుణ్ సందేశ్ తో కుర్రాడు సినిమా చేసినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. ఇక టాలీవుడ్ వదిలేసి బాలీవుడ్ లోనే సెటిల్ అయిన నేహా శర్మ అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవలేదు. జస్ట్ తనకు వచ్చిన సినిమాలు చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది నేహా.

సినిమాల కన్నా అమ్మడి ఫోటో షూట్స్ ఎక్కువ వైరల్ అయ్యాయి. గ్లామర్ షోకి కొత్త అర్ధం చెబుతూ తన స్కిన్ షోలో కూడా నావెల్టీ చూపిస్తుంది నేహా శర్మ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నేహా శర్మా అందాల విందు హంగామా చేస్తుంది. ముఖ్యంగా తన పరువాలతో ఫాలోవర్స్ ని పిచ్చోళ్లని చేయాలని ఫిక్స్ అయినట్టు ఉంది నేహా శర్మ అందుకే ప్రతి ఫోటో షూట్ లో తన అందాలకు బాగా పనిచెబుతుంది.

ఈ ఫోటో షూట్స్ వల్లే బాలీవుడ్ హీరోయిన్స్ కి ఈక్వల్ రేంజ్ క్రేజ్ తెచ్చేసుకుంది నేహా శర్మ. ఫ్రీ టైం లో ఏమి తోచక చేసిన ఈ ఫోటో షూట్స్ ఆమె మళ్లీ బిజీ అయ్యేలా చేస్తున్నాయి. బాలీవుడ్ లో నేహాకి మళ్లీ వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గా ఇన్ స్టా రీల్స్ తో కూడా రచ్చ రచ్చ చేస్తుంది నేహా శర్మ. లేటెస్ట్ గా ఓ సాంగ్ తో రీల్ చేసిన నేహా ఆ రీల్ లో కూడా తన గ్లామర్ షో చూపించేస్తుంది. ఎవరేమి అనుకున్నా ఐ డోంట్ కేర్ నేను చేసేది నేను చేస్తా అంటూ నేహా శర్మ చేస్తున్న ఈ హాట్ షో తన ఫాలోవర్స్ కి మాత్రం మంచి కంటెంట్ ఇస్తుందని చెప్పొచ్చు.

ఇలా ఫేడవుట్ అయిన భామలంతా కూడా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా శర్మ సిస్టర్స్ చేసే ఫోటో షూట్స్ ఆడియన్స్ కి చెమటలు పట్టించేస్తున్నాయి. నేహా శర్మ ఫోటో షూట్స్ కేవలం నార్త్ సైడ్ మాత్రమే కాదు సౌత్ లో కూడా వైరల్ అవుతున్నాయి.

తెలుగులో ఆమె చరణ్ తో చేసింది కాబట్టి ఇప్పటికీ ఆమెని మెగా ఫ్యాన్స్ ఫాలో అవుతూనే ఉన్నారు. చరణ్ తో హీరోయిన్ గా కాకపోయిన ఓ స్పెషల్ సాంగ్ తో అయినా చేయాలని ఆమెని రిక్వెస్ట్ చేస్తున్నారు మెగా  ఫ్యాన్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

For Video>> https://www.instagram.com/reel/CkyIa40Is5L/?utm_source=ig_web_copy_link
Tags:    

Similar News