బాహుబలి పేరు చెబితేనే జనాల్లో విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. విషయంలో ఏంటో తెలుసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించేస్తారు. కోట్లాది మందిని ఎంతో ఆత్రంగా ఎదురుచూసేటట్లు చేసిన మూవీ బాహుబలి. మరి ఇలాంటి మూవీకి సంబంధించిన కార్యక్రమ నిర్వహణ అంటే ఎంత ఎలర్ట్ గా ఉండాలి?
హైద్రాబాద్.. ముంబైల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో పర్ఫెక్ట్ గా చూశాం. కానీ రీసెంట్ గా బాహుబలి ది కంక్లూజన్ చిత్రానికి గాను తమిళ్ వెర్షన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. నిర్వహణ గ్రాండ్ గానే ఉంది.. కొత్త సంగతులతో టీం ఆకట్టుకుంది కానీ.. నిర్వాహకుల తీరే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి ఫంక్షన్స్ కోసం టీం సభ్యులకు కార్వాన్ ను ఏర్పాటు చేయడం సహజం. అలాగే బాహుబలి హీరోయిన్స్ అనుష్క.. తమన్నాలకు కూడా చెరో కార్వాన్ ఇచ్చారు. అయితే.. వాటిపై ఆయా హీరోయిన్ల పేర్లు చూస్తే నవ్వుతో పాటు కోపం వచ్చేసినా ఆశ్చర్యం లేదు.
అనుష్క పేరును.. ఇంగ్లీష్ లో అనుస్క(ANUSKA) అని.. తమన్నా పేరు ధమన్నా (Dhamanna) అని రాశారంటే.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుంది. ఇంగ్లీష్ రాని వాళ్లతో రాయించారో.. లేక అనుష్క-తమన్నాలు తెలియని వాళ్లు రాశారో కానీ.. ఈ కార్వాన్ లపై పేర్లు మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/