బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటుడు నిర్మాత మాత్రమే కాదు.. ఓ క్రికెట్ జట్టుకు ఓనర్ కూడా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో (ఐపీఎల్) కోల్ కతా నైట్ రైడర్స్ షారూక్ దే. ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నప్పుడల్లా స్టేడియంకు వెళ్లి తన టీంలో ఉత్సాహం నింపుతుంటాడు. అతడి నైట్ రైడర్స్ టీంలో బ్రహ్మాండమైన ప్లేయర్లు ఉన్నారు. ఆ టీంకు కోచ్ గా రమ్మంటూ షారూక్ ఒకరికి ఆహ్వానం పలికాడు. అది వేరెవరో కాదు.. ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథా లీ రాజ్.
ఈమధ్య హిందీలోని ఓ టీవీ ఛానల్ మహిళా శక్తిపై ఓ ప్రోగ్రాం చేస్తూ దానికి మిథాలీ రాజ్ ను ఇన్వైట్ చేసింది. ఇదే ప్రోగ్రాంకు షారుక్ ను కూడా పిలిచారు. షూటింగ్ కు ముందు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం దొరికింది. ఈ సందర్భంగా మిథాలీ క్రికెట్ కావడానికి పడిన కష్టాలు.. ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు.. దిగమింగిన అవమానాలు... ఇవన్నీ దాటి విజేతగా ఎలా ఎదిగిందీ చెప్పుకొచ్చిందట. చివరకు ఉమెన్ వరల్డ్ కప్ విజయం అంచులదాకా రావడానికి పడిన తపన చెప్పడంతో షారుక్ ఇంప్రెస్ అయిపోయి తన టీంకు కోచ్ రమ్మని కోరాడట. అదేగానీ జరిగితే తాను చేయగలిగిందంతా చేస్తానని మిథాలీ బదులిచ్చింది.
నైట్ రైడర్స్ టీం కు ఇంతవరకు చాలామంది అనుభవజ్ఞులంతా కోచ్ లుగా పనిచేశారు. జాన్ బుచనన్ - డావ్ వాట్ మోర్ - ట్రెవర్ బేలిస్ - జాక్స్ కల్లిస్ వంటి వారంతా ఆ టీంను నడిపించారు. క్రికెట్ టీం కు ఇంతవరకు మహిళలు కోచ్ గా పనిచేసిన దాఖలాలే లేవు. షారుక్ ఈ మాట సరదాగానే అని ఉన్నప్పటికీ అలాంటి ఆలోచన చేసినందుకు అభినందించాల్సిందే.