ఆయన ప్రశంసలతో కీరవాణి కంట కన్నీళ్లు

Update: 2023-03-16 13:30 GMT
నాటు నాటు పాటకు చంద్రబోస్‌ తో కలిసి ఆస్కార్‌ అవార్డును అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి దేశం గర్వించేలా చేశారు. భారత సినీ చరిత్రలో ఎప్పటికీ ఈ విషయం నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. కీరవాణి సంగీతం తో మ్యాజిక్‌ చేసి నాటు నాటు పాటకు ఆస్కార్ ను సొంతం చేసుకున్నారు.

ఆస్కార్‌ అందుకున్న సమయంలో కీరవాణి మాట్లాడుతూ.. నేను రిచర్డ్‌ కార్పెంటర్‌ ల యొక్క సంగీతాన్ని వింటూ పెరిగాను. ఇప్పుడు ఇక్కడ ఆస్కార్ తో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి ఆస్కార్‌ దక్కించుకున్న నేపథ్యంలో రిచర్డ్‌ కార్పెంటర్‌ స్వయంగా తన టీమ్‌ తో ఒక పాట రూపంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోను షేర్‌ చేశారు.

ప్రపంచ ప్రసిద్ది గాంచిన కార్పెంటర్‌ నుండి అభినందనలు అందుకున్న కీరవాణి ఆనందానికి అవధులు లేవట. ఆ విషయాన్ని స్వయంగా ఆర్ఆర్ఆర్‌ మేకర్‌ రాజమౌళి పేర్కొన్నారు. తన అన్నయ్య యొక్క సంతోషాన్ని రాజమౌళి వ్యక్తం చేసి కార్పెంటర్‌ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ఆస్కార్‌ అవార్డు అందుకున్న సమయంలో.. అంతకు ముందు నామినేషన్స్ లో నిలిచిన సమయంలో కూడా అన్నయ్య కీరవాణి ఉద్వేగానికి గురి కాలేదు. కానీ మీ యొక్క సందేశాన్ని చూసిన తర్వాత ఉద్వేగానికి లోనయ్యాడని రాజమౌళి అన్నారు.

కీరవాణికి కార్పెంటర్‌ పై ఉన్న అభిమానంకు నిదర్శణం. నాటు నాటు పాట తో ఆస్కార్‌ దక్కించుకున్న సమయంలో కూడా పొందని ఉద్వేగాన్ని కార్పెంటర్‌ యొక్క పోస్ట్‌ ను చూసిన తర్వాత కీరవాణి పొందారు అంటే ఎంతటి అభిమానమో అర్థం చేసుకోవచ్చు.

ఎంతగానో అభిమానించే వ్యక్తి నుండి మన పేరు వినడమే గొప్ప విషయం అనుకుంటాం.. అలాంటి వారి నుంచి శుభాకాంక్షలు అందుకుంటే ఆనంద భాష్పాలు ఆగకుండా ఉంటాయా... కీరవాణికి విషయంలో అదే జరిగింది.           



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Video Here>>   https://www.instagram.com/p/CpybDiVDy8a/?hl=en

Similar News