బాహుబలి ది కంక్లూజన్ మూవీ సక్సెస్ స్థాయిపై టాలీవుడ్ అంతా తెగ సంతోషంగా ఉంది. బాలీవుడ్ నే కాదు.. ప్రపంచాన్నే నివ్వెరపరిచే విజయం సాధించింది బాహుబలి. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని వేనోళ్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా చేరారు.
'దేశంలో తెలుగు ప్రజల ఖ్యాతి ఎన్టీఆర్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. టాలీవుడ్ లో ఓ గొప్ప దర్శకుడు ఉన్నాడని నీ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పావ్' అంటూ రాజమౌళిని ప్రశంసించిన మోహన్ బాబు.. ప్రభాస్ విషయంలో మాత్రం కాసింత డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. 'బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే 'రాజులు' పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ' అంటూ ట్వీట్ చేశారు మోహన్ బాబు.
మోహన్ బాబు- ప్రభాస్ ఇద్దరూ కలిసి బుజ్జిగాడు సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందులో బావ డార్లింగ్ అంటూ మోహన్ బాబును ప్రభాస్ పిలవగా.. ఇప్పుడు బావా బాహుబలీ అంటూ బదులు తీర్చేసుకున్నారు మోహన్ బాబు.