శుక్రవారం ‘యన్.టి.ఆర్’ ఆడియో వేడుక భారీ ఎత్తునే చేశారు. ఈ వేడుక కు జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబం నుంచి చాలామంది హాజరయ్యారు. వాళ్లందరినీ ఇలా ఒక బహిరంగ వేడుకలో చూడటం అరుదైన విషయమే. అందుకే నందమూరి అభిమానులకు ఈ వేడుక చాలా చాలా ప్రత్యేకంగా.. మధురంగా అనిపించింది. కేవలం నందమూరి వారే కాదు.. సూపర్ స్టార్ కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజు సహా ఇండస్ట్రీ అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందరూ వేదిక ఎక్కి ప్రసంగాలు చేశారు. బాలయ్య ఎప్పట్లాగే సుదీర్ఘ ప్రసంగం చేశాడు. అరగంటకు పైగా మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో మంచి స్పీచ్ ఇచ్చాడు. ఇంకా చాలామంది ఈ వేడుకలో మాట్లాడారు. ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
ఐతే ఎవరెంత మాట్లాడినా.. ఎంత పొగిడినా.. ఈ వేడుకలో బాగా హైలైట్ అయింది మాత్రం కలెక్షన్ కింగ్ మోహన్ బాబే. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ మాత్రమే కాదు.. టాక్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ కూడా అయ్యాయి. ఈ వేడుకలో ఏం మాట్లాడాలనే విషయంలో బాలయ్య తనను ఇబ్బంది పెట్టేసినట్లుగా చెబుతూ మోహన్ బాబు ప్రసంగం మొదలుపెట్టడంతోనే అందరూ ఆశ్చర్యపోయి చూశారు. చివర్లో క్రిష్ దగ్గరికి వచ్చేసరికి అతను చెడ్డ వాళ్లుగా చూపించారేమో తెలియదంటూ మోహన్ బాబు చేసిన కామెంట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మోహన్ బాబు ఎవరి పేరూ చెప్పకపోయినా ఇది చంద్రబాబు గురించి చేసిన కామెంటే అన్నది స్పష్టం. ఆయన ఆ మాట అనగానే బాలయ్య సహా వేడుకలో పాల్గొన్న మెజారిటీ జనాల గుండెల్లో రైళ్లు పరుగెత్తి ఉంటాయనడంలో సందేహం లేదు. కొన్నిసార్లు ఇలాంటి వేడుకల్లో మోహన్ బాబు మొహమాటం లేకుండా నిజాలు మాట్లాడేస్తుంటారు. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. అలాగే బాబు ప్రస్తావన తెచ్చేస్తాడేమో అని బాలయ్య అండ్ కో భయపడకుండా ఉండి ఉండరు. వాళ్లెలా ఫీలయ్యారన్నది పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం మోహన్ బాబు హైలైట్ అయిపోయారు. ఆయన కామెంట్ల మీద పెద్ద చర్చ నడిచింది. ఆయన బాబు పేరెత్తకపోయినా.. ఆయన్ని ఉద్దేశించే ఆ కామెంట్ చేశాడంటూ డిస్కషన్లు పెట్టారు.