ప్రభాస్‌ మరో బాలీవుడ్‌ మూవీ పై మరింత క్లారిటీ

Update: 2022-06-07 05:29 GMT
బాహుబలి తో పాన్‌ ఇండియా స్టార్‌ గా నిలిచిన ప్రభాస్‌ ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలను చేస్తున్నాడు. ఇటీవల ఈయన నటించిన రాధేశ్యామ్‌ విడుదల అయ్యి నిరాశ పర్చినా కూడా సినిమాల జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే హిందీలో ఈయన చేస్తున్న ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అయ్యింది. మరో వైపు సలార్‌.. ప్రాజెక్ట్‌ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదే సమయంలో మరో హిందీ సినిమా గురించిన క్లారిటీ ప్రభాస్‌ సన్నిహితుల నుండి వచ్చింది.

ప్రభాస్‌ హిందీలో వరుసగా సినిమాలు చేయబోతున్నాడని.. అక్కడి అభిమానులకు మరింతగా చేరువ అవ్వడం కోసం అక్కడి ఫిల్మ్‌ మేకర్స్ తో సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు అంటూ కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఓమ్‌ రౌత్‌ ఆదిపురుష్ ను పూర్తి చేసిన ప్రభాస్ త్వరలోనే మరో హిందీ స్టార్‌ డైరెక్టర్‌ సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్తలు చాలా నెలల క్రితమే వచ్చాయి.

సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక పక్కా కమర్షియల్‌ బాలీవుడ్‌ సినిమా ప్రభాస్ హీరోగా రూపొందబోతున్నట్లుగా దాదాపు ఏడాది క్రితమే వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్‌ గురించి కనీసం చిన్న అప్‌డేట్ కూడా లేకపోవడంతో అవన్నీ పుకార్లే అనుకున్నారు.

కాని తాజాగా ప్రభాస్ మరియు సిద్దార్థ్ ఆనంద్‌ కాంబోలో సినిమా ఉండబోతుంది.. ఆ సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వడానికి కనీసం ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. మరో వైపు సిద్దార్థ్ ఆనంద్‌ కూడా బ్యాక్ టు బ్యాక్ హిందీలో భారీ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాల తర్వాత ప్రభాస్ తో సినిమా ను సిద్దార్థ్‌ ఆనంద్ చేసేందుకు ఇప్పటికే స్టోరీ లైన్ కూడా సిద్దంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

పూర్తిగా హిందీలో.. హిందీ టెక్నీషియన్స్ తో హిందీ నటీ నటులతో రూపొందబోతున్న ఆ సినిమా ను మైత్రి వారు భారీ బడ్జెట్‌ తో నిర్మించబోతున్నారట. తెలుగు మరియు ఇతర సౌత్‌ భాషల్లో కూడా ఆ భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. సిద్దార్థ్‌ ఆనంద్‌ సినిమా అంటే కమర్షియల్‌ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయనే అభిప్రాయం ఉంది. కనుక ప్రభాస్ తో ఆయన చేయబోతున్న సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News