యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని కరోనా పరిస్థితుల వల్ల మూడోసారి కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పాన్ ఇండియా సినిమాలు విడుదల చేసే పరిస్థితులు లేకపోవడంతో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా దసరా సీజన్ ని వదులుకుంది. సినిమాలకి తదుపరి మంచి సీజన్ సంక్రాంతి. అందుకే జనవరి 7వ తేదీన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాలను మేకర్స్ పరిశీలిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే సంక్రాంతి బెర్తులు ఖరారు చేసుకున్న సినిమాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 'బాహుబలి' చిత్రాన్ని విడుదల చేసిన సమయంలోనే RRR ను తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి కూడా అక్టోబర్ 21 నాటికి దాదాపు పూర్తి అవుతాయని చిత్ర బృందం తెలిపింది. మొత్తం మీద డిసెంబర్ నాటికి సినిమా రెడీ అయిపోతుంది. రిలీజ్ డేట్ దొరికితే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చు. కాకపోతే జక్కన్న మాత్రం వచ్చే సమ్మర్ రిలీజ్ కే మొగ్గుచూపుతున్నారని టాక్.
వరల్డ్ సినిమా మార్కెట్ ఎప్పుడు కుదుటపడితే అప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. వేసవి సమయానికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి.. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని రాజమౌళి భావిస్తున్నారట. 'కేజీయఫ్ 2' లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని 2022 ఏప్రిల్ కి వాయిదా వేయడానికి కారణం కూడా అదే. మరి RRR చిత్రాన్ని కూడా అదే మాదిరిగా మరో తొమ్మిది నెలల తర్వాత విడుదల చేస్తారా లేదా సంక్రాంతికి వారం రోజుల ముందుగా థియేటర్లలోకి తీసుకొస్తారో చూడాలి.