పవర్ స్టార్ రాజకీయాల తర్వాత రీఎంట్రీ ఇస్తూనే వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేసాడు. వకీల్ సాబ్ ముందుగా వస్తుంది కాబట్టి అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అలాంటిది మరి పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం గురించి ఎలాంటి వార్త తెలిసినా అభిమానులకు పండగే అవుతుంది. పవర్ స్టార్ నటిస్తున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు.
చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కథ మొఘలుల సామ్రాజ్యంలోని ఓ బందిపోటు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. హిస్టోరికల్ మూవీ కావడంతో భారీ సెట్లతో ఆ కాలంనాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఫస్ట్ హిస్టోరికల్ మూవీ ఇదే కావడం విశేషం.
అసలు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కు ఎలాంటి మూవీ అయినా కలెక్షన్స్ ఇట్టే రాబడుతుందనే టాక్ ఉంది. అలాంటిది హిస్టారికల్ మూవీ అంటే గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. దర్శకుడు క్రిష్ కూడా భారీ గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఎందుకంటే హిస్టోరికల్ ఫిలిమ్స్ ఆల్రెడీ క్రిష్ తీసాడు కాబట్టి ఎలాంటి మిస్టేక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడట.
అయితే ఈ సినిమా టైటిల్ గురించి తాజాగా ఫిలింనగర్ చుట్టూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విరూపాక్షగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు బందిపోటు.. గజదొంగ అనే టైటిల్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు 'హరహర మహాదేవ్' 'వీరమల్లు' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండు కాదని రెండింటిని మిక్స్ చేసి 'హరహర వీరమల్లు' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే శివరాత్రి రోజున అధికారికంగా ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏది ఫైనల్ అయిందో!