సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ `స్పైడర్` భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ స్టార్ డమ్ ... మురగదాస్ అసాధారణ నైపుణ్యానికి ఉన్న గుర్తింపు వల్ల స్పైడర్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం... కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం అనే భావించారు. ఆ రేంజ్ లో ఆర్భాంటం జరిగింది. పైగా మురుగదాస్.. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ (స్టాలిన్) చేసిన తర్వాత రెండవ ప్రయత్నంగా మహేష్ (స్పైడర్ ) ని డైరెక్ట్ చేయడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. కానీ తొలి ప్రీమియర్లతోనే స్పైడర్ ఘోరంగా బోల్తా కొట్టిందన్న టాక్ రావడం షాక్ నిచ్చింది.
ప్రతినాయకుడు సూర్య క్యారెక్టర్ తప్ప! మిగతా అన్ని పాత్రలు ఈ సినిమాలో ఫెయిలయ్యాయని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరాజయం తర్వాత మురగదాస్ అటు కోలీవుడ్ కి షిఫ్టయ్యాడు. విజయ్ తో సర్కార్ చిత్రాన్ని చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇంత మంచి కథతో మహేష్ తోనే సినిమా చేయొచ్చు కదా! అని సర్కార్ రిలీజ్ అనంతరం సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. మహేష్ స్టార్ డమ్ ని దించేలా స్పైడర్ చేశావేమిటి? అంటూ అతడిని సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ కామెంట్లపై గానీ.. స్పైడర్ రిజల్ట్ పై గానీ ఇప్పటివరకూ మహేష్ గానీ...మురగదాస్ గానీ ఎక్కడా అనవసర వ్యాఖ్యలు చేయలేదు.
ఇద్దరూ వేరు వేరుగా చాలా వేదికలపై పాల్గొన్నారు గానీ...స్పైడర్ ముచ్చట మాత్రం ఎక్కడా తీసుకురాలేదు. తాజాగా దర్బార్ ప్రమోషన్ లో మురగదాస్ స్పైడర్ ప్లాప్ పై వివరణ ఇచ్చారు. స్పైడర్ తో మహేష్ ని కోలీవుడ్ లో లాంచ్ చేసాను. ఇక్కడ మహేష్ ఎంట్రీపై నే ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేసా. బహుశా తెలుగు ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయానేమో! అందువల్లే స్పైడర్ కు న్యాయం చేయలేకపోయానని అనిపించింది. కానీ ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతా. తెలుగు ఆడియన్స్ ని ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. త్వరలోనే మరో తెలగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు.