వెట‌ర‌న్ న‌టి ప్ర‌భ సోద‌రుడు ప్ర‌ముఖ ఎడిట‌ర్ ప్ర‌సాద్ మృతి

Update: 2021-05-15 09:30 GMT
ప్ర‌ముఖ వెట‌ర‌న్ న‌టి ప్ర‌భ సోద‌రుడు ప్ర‌ముఖ ఎడిట‌ర్ NGV ప్ర‌సాద్ మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 72. క‌రోనాకు చికిత్స పొందుతూ చెన్నై వెంక‌టేశ్వ‌ర ఆస్ప‌త్రిలో ఆయ‌న క‌న్నుమూశారు. మే 3న ఆస్ప‌త్రిలో చేర్చ‌గా ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయ‌న‌కు ఇంత‌లోనే ప‌రిస్థితి విషమించింది.

ప్ర‌భ‌కు ఇద్ద‌రు అన్న‌య్య‌లు.. కాగా ప్ర‌సాద్ చిన్న అన్న‌. NGV ప్ర‌సాద్ తెలుగు-త‌మిళ చిత్రాల‌కు ఎడిట‌ర్ గా కొన‌సాగారు. కోదండ‌రామిరెడ్డి కాంపౌండ్  స‌హా సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తో పని చేశారు. ఎడిట‌ర్ కంద‌స్వామి అసిస్టెంట్ గా ప‌ని చేశారు. సాంగ్స్ ఎడిటింగ్ లో ఆయ‌న స్పెష‌లిస్ట్.

కోవిడ్ ఎంద‌రి కుటుంబాల్లోనో విషాదం నింపుతోంది. చిన్న అన్న ఆక‌స్మిక‌ మ‌ర‌ణం క‌ల‌చివేసింద‌ని ప్రభ ఆవేద‌న చెందారు. అన్న‌య్య కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌కు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు .. ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. అంద‌రూ సెటిల‌య్యారు.ఇటీవ‌ల రిటైర్ అయ్యి ఇంట్లోనే పిల్ల‌ల‌తో స‌మ‌యం గ‌డుపుతున్నారని ప్ర‌భ తెలిపారు.
Tags:    

Similar News