మహానటి కోసం మహా ప్రయాస

Update: 2018-05-07 05:14 GMT
సావిత్రి వంటి మహానటి జీవితంపై సినిమా తీయాలనే ఆలోచన చేయడమే ఓ పెద్ద సాహసం. అసలు ఆ ఆలోచనే ఇన్నేళ్లూ ఎవరికీ రాలేదు. కానీ ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ అంశాన్ని సుసాధ్యం చేసి.. సినిమాను పూర్తి చేసి.. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు.

 తాను చిన్నప్పటి నుంచి సావిత్రి సినిమాలు..పాటలు ఎన్నో చూసి పెరిగానన్న ఈ దర్శకుడు.. 2 దశాబ్దాలకు పైగా టాప్ హీరోయిన్ గా అసమాన ప్రతిభ కొనసాగించడం అంత చిన్న విషయమేమీ కాదని.. అందుకే ఆమె కథను సినిమా తీయాలని భావించానని చెప్పాడు నాగ్ అశ్విన్. అయితే.. మూవీ మేకింగ్ విషయంలో చాలానే ఆలోచించాల్సి వచ్చిందన్నాడు ఈ దర్శకుడు. తొలుత తాను ఈ సినిమాలో 20 పాటలను పెట్టాలని భావించానని అన్నాడు. కానీ అది సాధ్యం కాదనే సంగతి తనకు తెలుసని.. అందుకే వీలైనంత క్లుప్తంగా ఈ చిత్రాన్ని రూపొందించానని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్.

దేవదాసు వంటి సినిమాలు బ్లాక్ అండ్ వైట్ అయినా.. ఆమె నలుపు తెలుపు దుస్తుల్లో కనిపించినా.. సావిత్రి నిజానికి రంగుల దుస్తులే ఉంటుందని.. ఆ విషయాలను డెప్త్ గా రీసెర్చ్ చేసేందుకు చాలా సమయం పట్టిందని అన్నాడు నాగ్ అశ్విన్. మహానటి మూవీని.. ఓ సినిమా తీయాలనే ఆలోచనతో కాకుండా.. ఓ అద్భుత చరిత్రను ఈ తరానికి అందించాలని భావించినట్లు తెలిపాడు.
Tags:    

Similar News