ఎంత పేరు సంపాదించుకున్నా.. ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నా.. ఎంత ప్రతిభ ఉన్నా కొందరికి అన్నీ కలిసిరావు. కొన్నింటిలో మాత్రం వారు రాణిస్తారు. ముఖ్యంగా రాజకీయాలు అసలే కలిసి రావు. ఈ కోవలోకే వస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో సున్నిత మనస్కుడైన మెగాస్టార్ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నించినా ఇక్కడ కుదరలేదు. ఆయన నటన గురించిగానీ.. తన సినిమాల గురించిగానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనో నట శిఖరం అంటే తప్పేమీ కాదు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ మెగా హీరో.. 2009 ఎన్నికలకు ముందు సినీ రంగం నుంచి రాజకీయం రంగ ప్రవేశం చేశారు. అయితే ఈ పాత్రలో ఆయన పెద్దగా ఇమడలేకపోయారనే చెప్పాలి. ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టిన చిరంజీవి.. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అనంతరం జరిగిన పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి తాను రాజ్యసభకు వెళ్లారు.
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించిన ఆయన రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ కి సంబంధించి మరోవార్త రాష్ట వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపనుందనే విషయం దావానంలా వ్యాపించింది. దీనిపై మెగాస్టార్ నుంచిగానీ.. అటు ఆ పార్టీ నుంచిగానీ ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. అయితే ఈ విషయంపై మెగాస్టార్ తమ్ముడు..జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మెగాస్టార్ రాజ్యసభ ఎంట్రీ పై ఒక క్లారిటీ ఇచ్చారు.
ఇకపై చిరంజీవి సినిమాలకే అంకితం కానున్నట్లు వెల్లడించారు. కళామతల్లి సేవకే ఆయన జీవితమని చెప్పుకొచ్చారు. తన అన్న చిరంజీవి కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా పిలిచి మరీ రాజ్య సభ ఇస్తుందని.. కానీ ఆయన రాజకీయాలు వద్దనుకున్నారని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో అన్నయ్య చూడని ఒడిదుడుకులు లేవని.. కేంద్ర మంత్రిగా పని చేసిన ఆయను అన్నీ తెలుసునని వివరించారు. ప్రస్తుతానికి చిరంజీవి ఏ పార్టీకి సపోర్టు చేయడం లేదన్నారు. రాజకీయాల్లో అన్నదమ్ములు ఉండకూడదనేది చిరంజీవి అభిప్రాయమని.. కల్యాణ్ రాజకీయ భవిష్యత్ బాగుండాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కుండ బద్దలు కొట్టారు. ఒక రకంగా తమ్ముడు కోసం అన్నయ్య త్యాగం చేశాడని, కల్యాణ్ బాబు డెడికేషన్ చూసే ఈ నిర్ణయం తీసుకున్నారని మెగా బ్రదర్ వ్యాఖ్యానించారు. అన్నయ్య తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబం మొత్తం మద్దతు పలికామన్నారు. ఒక రాజకీయ పార్టీ నుంచి రాజ్యసభ కు అన్నయ్య వెళతారనే విషయాన్ని ఖండించడానికి ఇదే మంచి సమయంగా భావించినట్లుగా నాగబాబు చెప్పారు. అయితే ఆయన రాజ్యసభ కు వెళ్లరనేది తన అభిప్రాయమేనని మనసు లో మాటను బయట పెట్టారు. మరి దీని పై మెగాస్టార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.