తన తమ్ముడు అఖిల్ చాలా బోల్డ్ అంటున్నాడు అక్కినేని నాగచైతన్య. తన ప్రేమను తండ్రికి చెప్పడంలో అఖిల్ చూపించినంత ధైర్యం.. తన ప్రేమను తెలియజేయడంలో తాను చూపించలేదని చైతూ అన్నాడు. తన కొత్త సినిమా ‘ప్రేమమ్’ ఈ శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో చైతూ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి అతను చెప్పిన ఆసక్తికర సంగతులు...
‘‘సమంతతో నా లవ్ స్టోరీ గురించి కొందరు స్నేహితులకు ముందే తెలుసు. ఆ తర్వాతే నాన్న గారికి చెప్పాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. నాన్నకు చెప్పాక అమ్మకు చెప్పాను. ఐతే అఖిల్ మాత్రం తన ప్రేమ గురించి నాన్నకు ముందే ధైర్యంగా చెప్పేశాడు. ఇక నా ప్రేమ విషయం మీడియాలో బయటపడ్డాక నేనేమీ ఉద్దేశపూర్వకంగా దాపరికం పాటించలేదు. అప్పుడు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నా. సోషల్ మీడియాను నేను కేవలం సినిమాల సంగతులు పంచుకోవడానికే ఉపయోగిస్తాను. వ్యక్తిగత విషయాలు అందులో వెల్లడించను. ఎలాగూ నా సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలుస్తాను కాబట్టి అప్పుడు అన్ని విషయాలూ పంచుకుందాంలే అనుకున్నాను. వచ్చే ఏడాది నా పెళ్లి ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తుంది. నా వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. పెళ్లి తర్వాత మేమిద్దరం కూడా కలిసి నటిస్తాం. ‘ప్రేమమ్’ సినిమాలో సమంత ఎందుకు లేదంటే ఏం చెప్పలేను. అందులో హీరోయిన్ల ఎంపిక దర్శక నిర్మాత ఇష్టం’’ అని చైతూ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/