అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'వెంకీమామ' సినిమానే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతు సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేసి డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు.. సినిమా లాంచ్ సమయంలో అదే విషయం వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ మారిపోయిందని టాక్.
సినిమా షూటింగ్ ముందుగా ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ చిత్రం సంగీతం నేపథ్యంలో సాగే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. అందుకే వ్యాలెంటైన్ డే సమయంలో రిలీజ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫిలిం మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాలో సాయి పల్లవి ఒక క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో నటిస్తోందట. ఇక చైతు ఓ తెలంగాణా యువకుడిగా కనిపిస్తాడని.. తెలంగాణా యాసలో మాట్లాడతాడని అంటున్నారు. చైతు కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి.
సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు రెగ్యులర్ మసాలా సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఇంటిల్లిపాది చూడగలిగేలా ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములకు పోటీనేలేదు. ఆడియన్స్ కూడా చైతును ఇలాంటి ఫిలిమ్స్ లో చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. శేఖర్ కమ్ముల - నాగ చైతన్య- సాయి పల్లవి కాంబినేషన్ తప్పనిసరిగా క్రేజీ అని చెప్పవచ్చు. మరి ఇది మరో 'ఫిదా' లా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.