కెరీర్ పైనే నాగ చైత‌న్య పూర్తి శ్ర‌ద్ధ‌

Update: 2021-11-05 05:08 GMT
వ్య‌క్తిగ‌త జీవితాన్ని.. వృత్తిగ‌త జీవితాన్ని స‌ప‌రేట్ గా చూడ‌క‌పోతే ఏ ఒక్క‌టి డిస్ట్ర‌బ్ అయినా రెండో ప‌నికి ఇబ్బంది. తీవ్ర ఆటంకం ఎదుర‌వుతుంది. త‌ద్వారా ఇత‌ర‌ ప‌రిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే కోణంలో ఆలోచించి నాగ‌చైత‌న్య - స‌మంత .. ఇటీవ‌ల కెరీర్ పైనే దృష్టి సారిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా స‌మంత వ‌రుస విహార యాత్ర‌ల‌తో బిజీ అయిపోయి అన్నిటినీ మ‌ర్చిపోతోంది. త‌దుప‌రి న‌గరంలో అడుగుపెట్ట‌గానే సినిమాల‌తో బిజీ అయిపోయేందుకు వ‌రుస క‌మిట్ మెంట్ల‌కు సంత‌కం చేసింది.

నాగ‌చైత‌న్య కూడా ఇంచుమించు అదే విధంగా కెరీర్ పై శ్ర‌ద్ధ పెట్టారు. అన‌వ‌స‌ర‌మైన వివాదాల‌కు తావివ్వ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం అత‌డు విక్ర‌మ్.కె ద‌ర్శ‌క‌త్వంలో థాంక్యూ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య - రాశి ఖన్నా ఈ చిత్రంలో జంట‌గా న‌టిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చాలా భాగాన్ని చిత్ర యూనిట్ పూర్తి చేసింది. త్వరలో మూడు రోజుల షూటింగ్ కోసం యూనిట్ రాజమండ్రి వెళ్లనుంది. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత థ్యాంక్యూ టీమ్ ఒక ముఖ్యమైన ప్యాచ్ వర్క్ షెడ్యూల్ కోసం గంభీరమైన మైసూర్ నగరానికి వెళ్లనుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల కోసం టీమ్ హైదరాబాద్ కు తిరిగి వస్తుంది.

ఇటీవ‌ల ల‌వ్ స్టోరి చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న చైత‌న్య కెరీర్ ప‌రంగా బెస్ట్ ఫేజ్ లో ఉన్నార‌నే చెప్పాలి. ఇంత‌కుముందు అత‌డు ఆశించిన మాస్ ఇమేజ్ ద‌క్క‌క‌పోయినా క్లాసీ హీరోగా త‌న బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టుగా ప్రేమ‌క‌థల్ని ఎంచుకుని విజ‌యాలు అందుకుంటున్నాడు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చ‌ద్దా చిత్రంతో బాలీవుడ్ లోనూ అత‌డు అడుగుపెడుతున్నాడు. ఇటీవ‌ల ల‌వ్ స్టోరి ప్ర‌మోష‌న్స్ కి అమీర్ హైద‌రాబాద్ కి విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే బంగార్రాజు చిత్రంలో కింగ్ నాగార్జున‌తో క‌లిసి చైతన్య న‌టిస్తున్నాడు. బంగార్రాజులో చైతూ నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే పాత్ర‌లో క‌నిపిస్తార‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News