ఆ ప్రేమ పెళ్ళిగా మారి పాతికేళ్ళయ్యింది

Update: 2017-06-12 07:34 GMT
శివ సినిమాతో నాగార్జున తెలుగు సినిమాకు ఇచ్చిన కిక్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతవరకు సాదా తెలుగు హీరోలా నటిస్తున్న నాగ్ ఒక్కసారిగా యంగ్ యాక్షన్ హాండ్సమ్ హీరోగా అందరి మదిలో నిలిచిపోయాడు. అదే సినిమాలో నాగ్ కు జోడీగా నటించిన అమల ముఖర్జీ కూడా అందరినీ తన స్లిమ్ ఫిగర్ తో కొత్తతరం నటనతో అందంగా కనిపించి తన దారిని బ్యూటిఫుల్ గా మార్చుకుంది.

నాగార్జున అమల కలిసి ఆ తరువాత నిర్ణయం సినిమా షూటింగ్లో  ప్రేమలోపడి పెళ్లి చేసుకోవాలిని నిర్ణయం తీసుకున్నారు. ఎంత కమ్మిట్మెంట్ తో తీసుకున్నారంటే.. ఆ ప్రేమపెళ్ళికి ఇప్పుడు సరిగా 25 ఏళ్ళు నిండాయి. 1992 జూన్‌ 11న వీరికి పెళ్లి జరిగింది. సినిమా లో ప్రేమికులుగా నటించి అందరినీ మెప్పించిన ఈ ఎవర్ గ్రీన్ ప్రేమ పక్షులు, పెళ్లి చేసుకొని అందరిచే ఆరాదించబడేలా నిలిచిపోయారు. తొలి ప్రేమ వికటించినా మలి ప్రేమను పదిలంగా మలుచుకొని గొప్పగా చేసుకున్నారు నాగ్. ఈ సందర్భంగా నాగార్జున తమ పెళ్లి ఫోటోను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసి ‘ఈరోజుతో పాతికేళ్లవుతోంది’ అని ట్వీట్‌ చేశారు. నాగార్జున బిజినెస్ మాన్ గా ఫ్యామిలి మాన్ సూపర్ స్టార్ గా అన్నింటినీ చక్కగా నడిపించుకు వస్తున్నాడు అమల సపోర్ట్ తో.

నాగార్జున తో పెళ్లి తర్వాత సినిమాలను దూరం పెట్టి కుటంబ బాధ్యతలును తీసుకున్న అమల సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మళ్ళీ వెండితెరకు  2012లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ కొడుకు అఖిల్ కూడా హీరోగా నిలదొక్కుకునే  ప్రయత్నం చేస్తూ.. రాత్రి డాడ్ అండ్ మామ్ కోసం స్పెషల్ పార్టీయే ఇచ్చాడు.  కొడుకు నాగ చైతన్య పెళ్లి పనులలో చాల బిజీగా ఉన్నారు. అలాగే నాగ్ పెద్ద కొడుకు (మొదటి భార్య సంతానం) నాగ చైతన్య అంటే కూడా అమలకు చాలా ప్రేమ. ఏదేమైనా నాగ్ అండ్ అమల ఒక వండర్ ఫుల్ కపుల్. అందరూ చూసి నేర్చుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News