హర్రర్ సినిమాతో బర్త్ డే గిఫ్ట్

Update: 2017-06-01 10:19 GMT
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రొడ్యూసర్ గా ఈ ఏడాది ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో హిట్ కొట్టాడు. నటుడిగా మాత్రం నాగార్జునకు ఏడాది మొదట్లో నిరాశే ఎదురైంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఓం నమో వేంకటేశాయ సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దీనితర్వాత ఎవరూ ఊహించని విధంగా హర్రర్ కామెడీ సినిమాకు నాగార్జున ఓకే చెప్పాడు. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-2 చేస్తున్నాడు. పివిపి సినిమా బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తి కావచ్చింది.

అన్నీ అనుకూలిస్తే రాజుగారి గది-2 సినిమాను ఆగస్టు చివరి వారానికి రిలీజ్ చేయాలని సినిమా దర్శకుడు ఓంకార్, ప్రొడ్యూసర్ పి.వి.పి. ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 29 నాగ్ బర్త్ డే. అప్పటికి సినిమా థియేటర్లలోకి వస్తే నాగార్జునకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టు  ఉంటుందన్నది వారి ఆలోచన. అయితే ఈ డేట్ ఇంకా అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇంకా రెడీ అవలేదు. ఈమధ్య కాిలంలో సినిమా ఫస్ట్ కాపీ చూశాక నాగార్జున మొత్తం చూసి చేయాల్సిన మార్పుచేర్పులు ఏమన్నా ఉంటే చెబుతున్నాడు.అవసరమైతే రిలీజ్ డేట్ వాయిదా వేసి మరీ రీషూట్ చేయిస్తున్నాడు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

సోగ్గాడే చిన్నినాయనా - రారండోయ్ వేడుక చూద్దాం విషయంలో నాగ్ వ్యూహం బాగా వర్కవుటయింది. రాజుగారి గది-2 ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక నాగార్జున చెప్పే కరెక్షన్స్ చేయడానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఆగస్టు చివరినాటికి అయితే సమయం సరిపోతుంది. అందుకే అన్నీ కలిసివస్తాయి కాబట్టి ఆ డేట్ కే ఫిక్సయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.  రాజుగారి గది-2లో నాగార్జునకు కాబోయే కోడలైన సమంత కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News