21 మంది నిత్యం నాన్నతోనే -నాగ్‌

Update: 2015-06-28 07:49 GMT
''నాన్న(ఏఎన్నార్‌)గారి చివరి క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఇంకొన్ని నెలల్లో  చనిపోతారు అని తెలియగానే అప్పటివరకూ స్నేహితుడిగా ఉన్న నేను కొడుకుగా మారిపోయాను. నాన్న నేను జీవితాంతం స్నేహితుల్లా కలిసి ఉన్నాం. ఇక నెలలే గడువు అని తెలియగానే తండ్రి కొడుకులుగా మారిపోయాం. ప్రతిక్షణం అతడి వెంటే నీడలా ఉన్నాను. నాతో పాటు 21మంది (కొడుకులు, మనవలు, ఐదుగురు చిన్నపిల్లలు కలిపి) కుటుంబ సభ్యులు నిత్యం ఆయనతోనే ఉన్నారు'' అని చెప్పుకొచ్చారు కింగ్‌ నాగ్‌. గత ఏడాది మనం సినిమా షూటింగ్‌ చేస్తూ క్యాన్సర్‌ కారణంగా ఏఎన్నార్‌ మరణించిన సంగతి తెలిసిందే.

''అనునిత్యం అతడితోనే మేమంతా. రోజంతా గడిచి చివరిలో నిదురించడానికి వెళ్లే వరకూ నేను నాన్నతోనే ఉండేవాడిని. ఆయన బెడ్‌రూమ్‌లోకి వెళ్లేప్పుడు డోర్‌ తెరచి పంపించేవాడిని. కాసేపాగి నిద్రపోయారా లేదా? అన్నది తెలుసుకోవడానికి తలుపు తెరచి చూసేవాడిని. కొన్నిసార్లయితే రాత్రివేళల్లో తనతోనే ఉండేవాడిని. ఈ క్షణం అతడిని మిస్సవుతున్నా. నాన్న ఎక్కడున్నా ఇది చూస్తూనే ఉంటారు..'' అంటూ నాగార్జున ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఫిలింఫేర్‌ సౌత్‌ -2015 ఉత్సవాల్లో 'మనం' ఏకంగా ఐదు కేటగిరీల్లో పురస్కారాలు దక్కించుకుంది. ఈ సందర్భంలో నాగ్‌ అన్న మాటలివి.

Tags:    

Similar News