ఒకే రోజు రెండు పెళ్లిళ్లు.. కుదరదంటున్న నాగ్

Update: 2016-08-08 09:23 GMT
అక్కినేని నాగార్జున చాలామంది తండ్రుల్లాగా స్టీరియో టైప్ ఆలోచనలతో ఉండే రకం కాదు. తన కొడుకుల పెళ్లిళ్ల విషయంలో ఆయన స్పందించిన తీరే అందుకు నిదర్శనం. సమంతతో నాగచైతన్య ప్రేమాయణం గురించి తెలిసి నాగార్జున ఫైర్ అయిపోయినట్లు.. ఇంట్లో పెద్ద గొడవలు జరిగిపోయినట్లు కొందరు రూమర్ రాయుళ్లు ఉబుసుపోక ముచ్చట్లు పెట్టుకున్నారు కానీ.. నాగ్ మాత్రం ఈ ప్రేమాయణం గురించి తనదైన శైలిలో స్పందించాడు. సమంత పేరెత్తకుండా తన కొడుకు ఛాయిస్ తన ఇష్టమని.. తన సోల్ మేట్ తనకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. అఖిల్ కూడా ఓ అమ్మాయి పట్ల ఆసక్తి చూపిస్తున్నాడని ఆ వ్యవహారాన్ని కూడా చాలా సింపుల్ గా తేల్చేశాడు నాగ్.

ఐతే నాగ్ ఇలా స్పందించాక కూడా రకరకాల రూమర్లు వచ్చాయి. చైతూ.. అఖిల్ ఇద్దరూ ఒకేసారి పెళ్లి చేసుకోబోతోన్నట్లు డిసెంబర్లో పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున తాజాగా స్పందించాడు. పెళ్లి డేట్లు ఏమీ ఫిక్స్ కాలేదని.. అసలు తన కొడుకులిద్దరికీ ఒకే రోజు పెళ్లి చేసే ఉద్దేశం తనకు లేదని ఓ ఇంగ్లిష్ డైలీతో వ్యాఖ్యానించాడు నాగ్. తమ ఇంట్లో రెండు పెళ్లి వేడుకల వినోదాన్ని తాము మిస్సవ్వాలని అనుకోవట్లేదని.. కాబట్టి ఇద్దరి పెళ్లిళ్లు వేర్వేరుగానే జరుగుతాయని నాగ్ చెప్పాడు. తన కొడుకు ఛాయిస్ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని.. ప్రేమ.. పెళ్లి రెండింట్లోనూ తన కొడుకులదే నిర్ణయం అని.. అందులో తాను జోక్యం చేసుకోనని వ్యాఖ్యానించాడు నాగ్.
Tags:    

Similar News